Kollapur to Goa | టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్.. కొల్లాపూర్ టు గోవా ప్రత్యేక బస్సు
Kollapur to Goa | మీరు కొల్లాపూర్( Kollapur ) పట్టణవాసులా..! నల్లమల్ల అందాలను, సోమశిల( Somasila ) సోయగాయాలను చూసి చూసి బోర్ కొట్టిందా..? అందుకే మీ లాంటి వారి కోసమే గోవా( Goa ) అందాలను చూపించేందుకు టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) సిద్ధమైంది. కొల్లాపూర్ పట్టణం నుంచి గోవాకు ప్రత్యేక లగ్జరీ బస్సును నడిపించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. అది కూడా సరసమైన ధరకే.. గోవా టూర్( Goa Tour ) వివరాల కోసం..
Kollapur to Goa | త్రినేత్ర.న్యూస్ : కొల్లాపూర్.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం.. కృష్ణా నదికి, దట్టమైన నల్లమల్ల అడవులకు( Nallamalla Forest ) సమీపంలో ఉన్న పట్టణం అది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నప్పటికీ పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అటు నల్లమల్ల అందాలు, ఇటు సోమశిల( Somasila ) సోయాగాలతో ఇప్పుడిప్పుడే పర్యాటకులకు చేరువ అవుతుంది కొల్లాపూర్ పట్టణం( Kollapur Town ). అయితే ఎంతో వెనుకబడి ఉన్న కొల్లాపూర్ ప్రజలకు గోవా( Goa ) అందాలను వీక్షించేందుకు టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైలు సౌకర్యం లేకపోవడం, విమానాల టికెట్ల ధరలు భరించలేని ఆ మూరుమూల ప్రజలకు ఆర్టీసీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. సరసమైన ధరకే, తక్కువ బడ్జెట్‌లో గోవా వెళ్లేందుకు కొల్లాపూర్ ఆర్టీసీ డిపో యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
టీజీఎస్ ఆర్టీసీ కొల్లాపూర్ డిపో ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణం నుంచి గోవాకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గోవా అందాలను వీక్షించేందుకు, ఆ బీచ్‌ల్లో ఎంజాయ్ చేసేందుకు, ఆ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు అవకాశం కల్పిస్తుంది.
సూపర్ లగ్జరీ బస్సుల వివరాలు ఇలా..
- కొల్లాపూర్ నుంచి జూలై 26 సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది.
- గోవాకు 27న ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం ఇలా..
- జూలై 28న సాయంత్రం 6 గంటలకు గోవా నుంచి కొల్లాపూర్‌కు బయల్దేరుతుంది.
- జూలై 29న ఉదయం 6 గంటలకు కొల్లాపూర్ చేరుకుంటుంది.
టికెట్ ధరలు ఇలా..
- ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధర రూ. 3,000(రానుపోను)
తదితర వివరాల కోసం 9182294659(బుచ్చన్న) నంబర్‌లో సంప్రదించొచ్చు.

తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!





