ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న బౌద్ధ వారసత్వం.. లద్దాఖ్‌లో ఆధ్యాత్మిక సందడి
Buddha Relics Ladakh | బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడి జీవితం సాధారణ రాజకుమారుడి కథ కాదు. మానవ బాధల అర్థాన్ని అన్వేషిస్తూ సాగిన ఆత్మీయ ప్రయాణం అది. వృద్ధాప్యం, వ్యాధులు, మరణం వంటి అనివార్య సత్యాలను ప్రత్యక్షంగా చూసిన ఒక యువరాజు.. భౌతిక ప్రపంచాన్ని త్యజించి సత్యాన్వేషణ కోసం కఠోర తపస్సు చేపట్టాడు. చివరకు కోట్లాది మందికి శాంతి మార్గాన్ని చూపిన గురువుగా అవతరించిన ఆయన జీవితం నేటికీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. 2569వ బౌద్ధ పౌర్ణమి సందర్భంగా కేంద్రం లద్దాఖ్‌లో గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
- ఈ నెల 14 వరకు బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శన
- దేశ విదేశాల నుంచి బౌద్ధుల రాక
- ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం
- సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి వరకు ఆధ్యాత్మిక ప్రయాణం..
Buddha Relics Ladakh | త్రినేత్ర.న్యూస్ : బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడి జీవితం సాధారణ రాజకుమారుడి కథ కాదు. మానవ బాధల అర్థాన్ని అన్వేషిస్తూ సాగిన ఆత్మీయ ప్రయాణం అది. వృద్ధాప్యం, వ్యాధులు, మరణం వంటి అనివార్య సత్యాలను ప్రత్యక్షంగా చూసిన ఒక యువరాజు.. భౌతిక ప్రపంచాన్ని త్యజించి సత్యాన్వేషణ కోసం కఠోర తపస్సు చేపట్టాడు. చివరకు కోట్లాది మందికి శాంతి మార్గాన్ని చూపిన గురువుగా అవతరించిన ఆయన జీవితం నేటికీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. 2569వ బౌద్ధ పౌర్ణమి సందర్భంగా కేంద్రం లద్దాఖ్‌లో గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
సందడిగా లద్దాఖ్..
లద్దాఖ్ ప్రాంతం అంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శనతో భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లేహ్‌లోని బౌద్ధ మఠంలో మే 1 నుంచి 14 వరకు ఈ ప్రదర్శన జరుగుతోంది. సాధారణంగా ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య భద్రపరచబడే ఈ అవశేషాలను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రజల దర్శనార్థం బయటకు తీసుకువస్తారు. ఈ ప్రదర్శనలో అవశేషాలను ప్రత్యేకంగా తయారు చేసిన గాజు పెట్టెల్లో ఉంచి బహుళస్థాయి భద్రతా వ్యవస్థ మధ్య ప్రదర్శిస్తున్నారు. సీసీటీవీ పర్యవేక్షణ, పటిష్టమైన బందోబస్తు, నియంత్రిత ప్రవేశం వంటి చర్యలు అమల్లో ఉన్నాయి. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో క్యూ లైన్లు, తాగునీరు, వైద్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు.
2వేల సంవత్సరాలైనా సురక్షితంగానే..

లద్దాఖ్ బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రంగా ఉండడంతో ఈ ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. మఠాల్లో భిక్షువులు నిర్వహిస్తున్న పూజలు, పారాయణాలు, ధ్యాన శిబిరాలు ప్రాంతాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపుతున్నాయి. స్థానికులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొంటుండగా.. విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చారిత్రకంగా బుద్ధుడు మహాపరినిర్వాణం అనంతరం ఆయన అవశేషాలను విభజించి వివిధ స్తూపాల్లో ప్రతిష్టించారు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు ఈ అవశేషాలను విభజించి వివిధ ప్రాంతాలకు పంపినట్లుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. బౌద్ధమత వ్యాప్తిలో ఇది కీలక దశగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. అనంతరం దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు ఈ అవశేషాలు భూగర్భంలో సంరక్షితంగా ఉన్నాయని ఆధారాలు సూచిస్తున్నాయి.
1898 తవ్వకాల్లో బయటపడ్డ అవశేషాలు..
1898లో పిప్రాహ్వా ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో ఈ అవశేషాలు వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. అక్కడ వెలికితీసిన రేలిక్వరీల్లో బంగారం, రత్నాలు, పవిత్ర ధాతువులు లభించాయి. అనంతరం తవ్వకాలు కొనసాగాయి. ముఖ్యంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1970 నుంచి 1977 మధ్య నిర్వహించిన తవ్వకాలలో మరిన్ని అవశేషాలు బయటపడ్డాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఇవి క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. కాలక్రమేణా ఈ అవశేషాలను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడం ప్రారంభమైంది. శ్రీలంక, థాయ్‌లాండ్, మంగోలియా వంటి దేశాల్లో నిర్వహించిన ప్రదర్శనలకు విశేష ఆదరణ లభించింది.
శాక్య వంశంలో పుట్టిన గౌతముడు..
బుద్ధుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో లుంబినిలో జన్మించారు. ఆయన తండ్రి శుద్ధోధనుడు. శాక్య వంశానికి చెందిన ఆయన కపిలవస్తును రాజధానిగా చేసుకుని పాలించాడు. తల్లి మహామాయ. సిద్ధార్థుడు పుట్టిన కొద్దిరోజులకే తల్లి మహామాయ మరణించడంతో మహాప్రజాపతి గౌతమి పెంచినందున ఆయనకు ‘గౌతముడు’ అనే పేరు వచ్చింది. సిద్ధార్ధుడు తల్లి గర్భంలో ఉన్న సమయంలో తల్లి మాయాదేవికి ఒక ఆరు దంతాలు ఉన్న ఏనుగు తన గర్భంలోకి కుడి వైపు నుంచి ప్రవేశించినట్లుగా కలలో కనిపించింది. శాక్య వంశాచారం ప్రకారం.. గర్భవతిగా ఉన్న మాయాదేవి ప్రసవం కోసం తండ్రిగారింటికి బయలుదేరింది. మార్గమధ్యలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం కింద మగ బిడ్డను ప్రసవించింది. ఆయన జన్మించిన కొద్దిరోజులకే తల్లి మాయాదేవి కన్నుమూసింది. బిడ్డ పుట్టిన ఐదోరోజున నామకరణం వేడుక జరిగింది. ఈ క్రతువు కోసం శుద్ధోధనుడు పండితులను ఆహ్వానించాడు. వారి సూచన మేరకు తండ్రి సిద్ధార్థుడు అని నామకరణం చేశాడు. ఈ సందర్భంగా భవిష్యత్ చెప్పాలని శుద్ధోధనుడు కోరగా.. కౌండిన్యుడనే పండితుడు సిద్ధార్థుడు భవిష్యత్‌లో బుద్ధుడు అవుతాడని జోష్యం చెప్పాడు.
సిద్ధార్థుడినుంచి గౌతమ బుద్ధుడిగా..

సిద్ధార్ధుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు, సిద్ధార్ధుని గొప్ప చక్రవర్తిని చేయాలనే ధ్యేయంతో ఎలాంటి తాత్విక విషయాలు, సామాన్య ప్రజల కష్టసుఖాల గురించి తెలియకుండా చూసుకున్నాడు. సిద్ధార్థుడికి 16 సంవత్సరాలు వచ్చే సరికి యశోధరతో వివాహమైంది. రాహులుడనే కుమారుడు జన్మించాడు. సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు. తండ్రి శుద్ధోధనుడు బయట ప్రపంచంలో జరిగే విషయాలను తెలియకుండా ఉండేందుకు ప్రయత్నించినా సిద్ధార్థుడి 29వ నగర విహారం చేస్తున్న సమయంలో ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పిడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది.. జీవిత సత్యాలపై ఆలోచనలో పడ్డాడు. మానవ బాధలకు పరిష్కారం కనుగొనాలనే సంకల్పంతో రాజభవనం, కుటుంబాన్ని విడిచి తపస్సు మార్గం ఎంచుకున్నాడు. కఠిన సాధన అనంతరం బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడు. అనంతరం ‘బుద్ధుడు’గా ప్రసిద్ధి చెందాడు.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ..
బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం, మధ్యమ మార్గం, అహింస, కరుణ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశాయి. బౌద్ధమతం శాంతి, సహనం, సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. ప్రస్తుతం లేహ్‌లో జరుగుతున్న ఈ అవశేషాల ప్రదర్శన బుద్ధుడి బోధనలను మరోసారి గుర్తుచేస్తోంది. భక్తులు అవశేషాల ముందు ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తున్నారు. భిక్షువులు ఉపన్యాసాల ద్వారా అవగాహన పెంచుతుండగా, విద్యార్థులు, పరిశోధకులు బౌద్ధ చరిత్రపై అధ్యయనం చేస్తున్నారు. కార్యక్రమం లడఖ్‌ను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. పర్యాటక రంగానికి ఊతమిస్తూ, స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా రంగాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక ప్రభావం కూడా కనిపిస్తోంది. మొత్తానికి, బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శన కేవలం ధార్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా, వేల ఏళ్ల బౌద్ధ వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విశిష్ట వేదికగా నిలుస్తోంది. శాంతి, కరుణ, సహనం అనే బుద్ధుడి సందేశాలను సమాజానికి మరోసారి గుర్తుచేస్తోంది.
Read Also :
Kailash Mansarovar yatra | కలల యాత్ర.. కైలాస మానస సరోవర్!
Night Tourism | సూర్యాస్తమయం తర్వాతే అసలైన వినోదం..! రాత్రిపూట సందర్శించేందుకు బెస్ట్ ప్లేసెస్ ఇవే..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






