Night Tourism | సూర్యాస్తమయం తర్వాతే అసలైన వినోదం..! రాత్రిపూట సందర్శించేందుకు బెస్ట్ ప్లేసెస్ ఇవే..!
Night Tourism | ఎండ తీవ్రతతో పగటిపూట పర్యటనలు కష్టంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాక్‌టూరిజం ట్రెండింగ్‌లోకి వచ్చింది. రాత్రిపూట పర్యటనలో చల్లని వాతావరణం, తక్కువ రద్దీ, లైట్ల కాంతిలో ప్రత్యేక అనుభూతి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దేశంలోని ప్రముఖ నగరాలు కూడా నైట్ టూరిజానికి అనుగుణంగా మారుతూ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
Night Tourism | వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఈ ఎండాకాలంలో పర్యటనలు చేసేందుకు కొందరు వెనుకడుగు వేస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఎండలు, ఉక్కపోత, వేడిగాలులకు భయపడిపోతుంటారు. దాంతో బయటకు వెళ్లాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ట్రావెల్ ట్రెండ్ వేగంగా ప్రాచుర్యాన్ని పొందుతోంది. అదే నాక్‌టూరిజం. అంటే రాత్రివేళ్లలో పర్యటించడం. సాధారణంగా అందరూ ఉదయం నుంచి సాయంత్రం వేళ్లలోనూ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ, ఇందులో రాత్రివేళ్లలోనే ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం ఈ ట్రెండ్ స్పెషాలిటీ. వేడి తగ్గడం, తక్కువ జనసంచారం, లైట్ల వెలుతురులో విభిన్న అనుభూతిని ఇస్తుంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పర్యాటక కేంద్రాలు రాత్రివేళల్లో సందర్శకులకు అందుబాటులోకి వస్తున్నాయి. నైట్ మార్కెట్‌లు, ఫుడ్‌స్ట్రీట్స్, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు సైతం పర్యాటకులను రా రమ్మని ఆకర్షిస్తున్నాయి.
నైట్ టూరిజంతో ప్రయోజనాలు..
నైట్ టూరిజంతో వేసవి సమయంలో వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఎక్కువగా జన సంచారం ఉండకపోవడంతో ఆయా ప్రదేశాల్లో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు. లైట్ల వెలుగుల్లో నగరాలు అందాలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియులకు ఇదో మంచి అవకాశం. అయితే, రాత్రిపూట పర్యటనలో భద్రత ముఖ్యం. ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రదేశాలనే ఎంచుకోవాలి. ముందస్తు ప్రణాళికతో ప్రయాణం చేయడం, అవసరమైన వస్తువులు వెంట ఉంచుకోవడం మంచిది.
రాత్రివేళల్లో సందర్శించదగిన ప్రదేశాలు

ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబై ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’గా ప్రసిద్ధి. ఇక్కడి నైట్‌లైఫ్ దేశవ్యాప్తంగా పేరుపొందింది. రాత్రివేళల్లో మెరైన్ డ్రైవ్ వద్ద కూర్చొని సముద్ర గాలి ఆస్వాదించడం ఎంతో హాయిగా ఉంటుంది. రాత్రివేళల్లో మెరుస్తున్న లైట్లు ఆ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అలాగే కొలాబా, బాంద్రా ప్రాంతాల్లో నైట్ కెఫేలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి.

జైపూర్ : పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్ వేసవిలో పగటిపూట తీవ్ర ఎండతో ఇబ్బంది పెడుతుంది. సాయంత్రం తర్వాత ఈ నగరం కొత్త అందాలను సంతరించుకుంటుంది. హవా మహల్, అంబర్ కోట వంటి చారిత్రక కట్టడాలు రాత్రివేళల్లో వెలుగుల కాంతిలో మెరిసిపోతాయి. రాజస్థానీ సాంస్కృతిక ప్రదర్శనలు, ఫోక్ డ్యాన్స్‌లు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.

గోవా : గోవాలో వేసవి సమయంలో పర్యటనకు రాత్రి అనుకూలంగా ఉంటుంది. బీచ్‌ల వద్ద జరిగే నైట్ పార్టీలు, సంగీత కార్యక్రమాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. బాగా, కలంగూట్, అన్జునా వంటి బీచ్‌ల వద్ద రాత్రివేళల్లో ఉత్సాహభరితమైన వాతావరణం కనిపిస్తుంది. నైట్ మార్కెట్లు సైతం పర్యాటకులకు షాపింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రాత్రివేళల్లో సందడిగా ఉంటుంది. ఇండియా గేట్ వద్ద రాత్రిపూట విహారం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. లైట్ల వెలుగులో ఆ ప్రాంతం అందంగా కనిపిస్తుంది. చాందిని చౌక్, కన్నాట్ ప్లేస్ వంటి ప్రాంతాల్లో రాత్రి స్ట్రీట్ ఫుడ్ రుచులు అస్వాదించొచ్చు. కొన్ని ప్రాంతాల్లో నైట్ ఫుడ్ మార్కెట్లు ప్రారంభమవుతున్నాయి.

ఉదయపూర్ : సరస్సుల నగరంగా పేరుపొందిన ఉదయపూర్ రాత్రివేళల్లో మరింత అందంగా కనిపిస్తుంది. పిచోలా సరస్సు తీరంలో కూర్చొని నగరాన్ని వీక్షించడం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సిటీ ప్యాలెస్ వెలుగుల కాంతిలో మెరిసిపోతూ సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. సరస్సు మధ్యలో ఉన్న జాగ్ మందిర్ వంటి నిర్మాణాలు రాత్రివేళల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






