Snake Village of India | షెట్‌ఫల్ @ స్నేక్ విలేజ్ ఆఫ్ ఇండియా.. నాగుపాములతో గ్రామస్తుల సహజీవనం..!
Snake Village of India | ఆ గ్రామం నాగుపాములకు( King Cobra ) పుట్టినిల్లు. నాగుపాములతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న ఆ గ్రామం మరెక్కడో లేదు.. తెలంగాణ( Telangana ) పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర( Maharashtra )లోనే ఉంది. ఇప్పుడు ఈ పల్లె పాముల పల్లెగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదండోయ్.. ఆ గ్రామం ఇండియాలోనే స్నేక్ విలేజ్( Snake Village of India )గా రూపాంతరం చెందింది. మరి ఆ గ్రామం పేరేంటో తెలుసా షెట్‌ఫల్( Shetphal ).
సంక్షిప్త సారాంశం
పాము అనే పేరు విన్నా.. దాన్ని చూసినా ఒళ్లంతా జలదరిస్తుంది. వాటి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. కానీ ఈ గ్రామస్తులు మాత్రం పాములతోనే సహజీవనం చేస్తున్నారు. అది కూడా అత్యంత విషపూరితమైన నాగుపాములతో. ఈ పాములతో ఆ గ్రామస్తులందరికీ విడదీయలేని అనుబంధం ఉంది. తరతరాలుగా నాగుపాములతో చెలిమి చేస్తూ.. పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తున్నారు. దైవస్వరూపంగా భావించే నాగుపాములకు ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ప్రత్యేక దైవస్థానం ఉంది.
Snake Village of India | గ్రామాలు అంటేనే.. మానవ సమాజంతో పాటు పశు సంపదకు నెలవు. బంధాలు, బంధుత్వాలకు గుర్తు. పండుగలకు, శుభకార్యాలకు ప్రసిద్ధి. కానీ ఈ గ్రామం మాత్రం పాములకు ప్రసిద్ధి. మిగతా గ్రామాలతో పోల్చితే ఈ గ్రామం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామం నాగుపాములకు( King Cobra ) పుట్టినిల్లు. ప్రతి ఇంట్లో నాగుపాములు ఉంటాయి. అదేదో పుట్టల్లో ఉంటాయనుకుంటే పొరపాటే. ఇంట్లోని కుటుంబ సభ్యుల మాదిరిగా.. అవి వారిలో కలిసిపోతాయి. వారి మధ్యలోనే సంచరిస్తూ కాలక్షేపం చేస్తుంటాయి నాగుపాములు. ఆ గ్రామంలోని పిల్లలు కూడా నాగుపాములతో స్నేహంగా ఉంటారు. వాటి ఆలనాపాలనా చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. నాగుపాములతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న ఆ గ్రామం మరెక్కడో లేదు.. తెలంగాణ( Telangana ) పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర( Maharashtra )లోనే ఉంది. ఇప్పుడు ఈ పల్లె పాముల పల్లెగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదండోయ్.. ఆ గ్రామం ఇండియాలోనే స్నేక్ విలేజ్( Snake Village of India )గా రూపాంతరం చెందింది. మరి ఆ గ్రామం పేరేంటో తెలుసా షెట్‌ఫల్( Shetphal ).
షెట్‌ఫల్ గ్రామం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా( Solapur district )లో ఉంది. ఇక ఈ గ్రామంలో మనుషులకు సమానంగా నాగుపాములు ఉంటాయి. అవి జనాల మధ్య సంచరిస్తూ.. స్నేహపూర్వకంగా ఉంటాయి. ఎవరికీ ఎలాంటి హానీ కలిగించవు. అయితే నాగుపాముల కోసం తమ నివాసాల్లోనే ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. వాటిల్లోనే నాగుపాములు నివసిస్తుంటాయి. ఇండ్లలో, పిల్లల మధ్య తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాయి.
తరతరాలుగా పాములతో చెలిమి..
హిందూ సంప్రదాయంలో నాగుపాములకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిని దైవస్వరూపంగా చూస్తారు. నాగుపాములను ప్రత్యేకంగా పూజిస్తారు. సర్పధారణతో తమకున్న దోషాలను నివారించుకుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగి ఉన్న నాగుపాములను ఆ గ్రామస్తులు ఎంతో భక్తిభావంతో వాటిని పెంచుకుంటున్నారు. గత కొన్ని వందల ఏండ్ల నుంచి షెట్‌ఫల్ గ్రామంలో నాగుపాములను పూజిస్తూ.. వాటికి ఆవాసం కల్పిస్తూ తమ ఆచారాలను కొనసాగిస్తున్నారు. తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు నాగుపాముల వల్ల తమకు ఎలాంటి హానీ కలగలేదని పేర్కొన్నారు.

ఒక వేళ మీరు షెట్‌ఫల్ గ్రామాన్ని సందర్శించాలనుకుంటే ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
- పాములను తాకేందుకు, పట్టుకునేందుకు ప్రయత్నించకూడదు.
- గ్రామస్తుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- స్థానికుల అనుమతితో, వారి సూచన మేరకు పాములను పట్టుకునేందుకు యత్నించాలి.
- పొరపాటున కూడా అవి నివాసం ఉండే ప్రదేశంలోకి ఒంటరిగా వెళ్లొద్దు.
- స్థానికుల ఆచారాలను, నమ్మకాలను గౌరవించాలి.
షెట్‌ఫల్ గ్రామాన్నే కాదు.. ఆ ప్రాంతంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి.
- సిద్ధేశ్వర దేవాలయం
- షోలాపూర్ కోట
- షోలాపూర్ జిల్లాలోని గ్రామీణ సంస్కృతి
షెట్‌ఫల్‌కు ఎప్పుడు వెళ్లాలి మరి..?
షెట్‌ఫల్ గ్రామాన్ని సందర్శించాలంటే.. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. ప్రయాణానికి సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. వేసవి కాలంలో వెళ్తే ఎండ తీవ్రతను తట్టుకోలేరు.
షెట్‌ఫల్‌కు ఎలా చేరుకోవాలి..?
- ఒక వేళ విమానంలో వెళ్తే మొదటగా పుణె ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి 200 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి షెట్‌ఫల్ చేరుకోవచ్చు.
- రైలుమార్గంలో అయితే షోలాపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి.
- రోడ్డు మార్గంలో అయితే షోలాపూర్ వెళ్లి.. షెట్‌ఫల్ చేరుకోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!





