ACB | ఏసీబీలో అవినీతికి ఆస్కారం లేదు.. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ
ACB | ఏసీబీలో అవినీతికి (Corruption) ఆస్కారం లేదని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) తెలిపింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అవినీతికి పాల్పడేవారు ఏ స్థాయి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ACB | త్రినేత్ర న్యూస్: ఏసీబీలో అవినీతికి (Corruption) ఆస్కారం లేదని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) తెలిపింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అవినీతికి పాల్పడేవారు ఏ స్థాయి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు అధికారిపై (Investigation Officer) విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ ఎరుగు (Ambedkar Erugu) ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏసీబీ.. అధికారిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని వెల్లడించింది. నిష్పక్షపాతంగా శాఖాపరమైన విచారణ జరుపుతామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుడిని ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచామని, ఒక్కసారి కూడా హాజరుకాలేదని చెప్పారు. ఆరోపణలు నిరూపితమైతే ఏసీబీ అధికారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెల్లడించారు. సొంత శాఖ అధికారులైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.
గతేడాది సెప్టెంబర్ 15న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మణికొండ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ నివాసంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2 కోట్ల నగదు, బంగారం, ప్లాట్లు, భవనాలు, వ్యవసాయ భూములు, ఫామ్‌హౌస్‌లకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. అక్రమాస్తుల విలువ రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. అంబేద్కర్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయనను విద్యుత్ శాఖ సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ADE Ambedkar.. `మిమ్మల్ని కేసులో నుంచి తప్పించేందుకు సహకరిస్తా. రూ.30 లక్షలు ఇస్తే కేసు నీరుగార్చేలా చేసి మీకు అనుకూలంగా మార్చేస్తా. అయితే మాపై దర్యాప్తు అధికారి కక్ష కట్టినట్లు వ్యవహిస్తున్నారని తనపై ఫిర్యాదు చేయండి. అప్పుడు నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఉన్నతాధికారి కేసును సమీక్షించే సమయంలో గట్టిగా డిఫెండ్ చేయకుండా మీకు మేలు జరిగేలా చేస్తా` అని దర్యాప్తు అధికారి తనతో బేరసారాలు సాగించినట్లు ఏసీబీ ఉన్నతాధికారులకు అంబేద్కర్ ఫిర్యాదు చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో తాను జైలులో ఉన్న సమయంలో ఓ కాంట్రాక్టర్ ద్వారా ఈ వ్యవహారం సాగిందని ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలపై ఏసీబీ స్పందించింది. ఏసీబీలో అవినీతికి జీరో టాలరెన్స్ అని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

Rajagopal Reddy | అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు.. సీఎం రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
నవంబర్ 20, 2026

KA Paul | రేవంత్ పాలనలో పెరిగిన అవినీతి.. లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ: కేఏ పాల్
నవంబర్ 19, 2026

Raja Singh | తెలంగాణలో గుండాల రాజ్యం.. అవినీతి రాజ్యం: ఎమ్మెల్యే రాజాసింగ్
నవంబర్ 19, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి
- ●Indian Rare Earth Stocks | 2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..
- ●Pune court | హత్య కేసు నిందితుడిపై కోర్టు ఆవరణలో దాడి.. కత్తులతో నరికి
- ●Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్ మాత్రం హ్యాపీ!
- ●Smartphone Battery | ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చుకోండి!
- ●TGHRC | బాచుపల్లిలో ఎస్టీపీ క్లీన్ చేస్తుండగా ముగ్గురు మృతి.. సుమోటోగా విచారణకు స్వీకరించిన టీజీహెచ్ఆర్సీ

CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి

Indian Rare Earth Stocks | 2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..

Pune court | హత్య కేసు నిందితుడిపై కోర్టు ఆవరణలో దాడి.. కత్తులతో నరికి

Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్ మాత్రం హ్యాపీ!



