త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్‌ మాత్రం హ్యాపీ!

Peddi Movie | రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమా గురించి ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌ తన పాత్రను తెరపై చూపించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇదే చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన శ్రుతిహాసన్‌ మాత్రం తన నిర్ణయం పట్ల సంతోషంగా ఉంది. గ్లామర్‌గా కనిపించడం, డ్యాన్స్‌ చేయడం తనకు ఇష్టమని.. అయితే తనకు నచ్చని పనులు మాత్రం చేయనని శ్రుతి స్పష్టం చేసింది.

P

Entertainment | Published On Nov 25, 2026, 2.52 pm IST

Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్‌ మాత్రం హ్యాపీ!
Advertisement

Peddi Movie | రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమా గురించి ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌ తన పాత్రను తెరపై చూపించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇదే చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన శ్రుతిహాసన్‌ మాత్రం తన నిర్ణయం పట్ల సంతోషంగా ఉంది. గ్లామర్‌గా కనిపించడం, డ్యాన్స్‌ చేయడం తనకు ఇష్టమని.. అయితే తనకు నచ్చని పనులు మాత్రం చేయనని శ్రుతి స్పష్టం చేసింది. దీంతో ఇద్దరు హీరోయిన్ల వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

జాన్వీ ఏమందంటే?

ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ కపూర్‌ ‘పెద్ది’లో తన పాత్ర‌ గురించి మాట్లాడింది. కొన్ని సన్నివేశాల్లో తన క్యారెక్టర్‌ను అతిగా గ్లామరైజ్‌ చేశారని అభిప్రాయపడింది. షూటింగ్‌ సమయంలోనే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని చెప్పింది. సినిమాలో మహిళలను చూపించిన తీరు సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. తన పాత్ర విషయంలో కొన్ని విషయాలను ముందుగానే ఆలోచించి ఉండాల్సిందని జాన్వీ చెప్పడం గమనార్హం.

నాకు గ్లామర్‌ ఇష్టమేన‌న్న శ్రుతి

మరోవైపు రామ్‌చరణ్‌తో కలిసి ‘పెద్ది’లో స్పెష‌ల్ సాంగ్‌లో కనిపించిన శ్రుతిహాసన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించింది. డ్యాన్స్‌ చేయడం, అందంగా ముస్తాబవడం, తెరపై గ్లామరస్‌గా కనిపించడం తనకు ఇష్టమని చెప్పింది. అయితే, తనకు నచ్చని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని స్పష్టం చేసింది. తన అభిప్రాయంపై గట్టిగా నిలబడటం వల్ల కొందరు తనను కష్టమైన వ్యక్తిగా భావిస్తుంటారని కూడా వెల్లడించింది.

జాన్వీ గురించి మాట్లాడను..

జాన్వీ వ్యాఖ్యలపై స్పందించేందుకు శ్రుతి ఆసక్తి చూపలేదు. మరో నటి అనుభవం గురించి తాను మాట్లాడటం సరికాదని చెప్పింది. తాను మాత్రం తన ఇష్టంతోనే ‘పెద్ది’ ప్రత్యేక గీతంలో నటించానని, ఆ నిర్ణయంపై సంతోషంగా ఉన్నానని తెలిపింది. జాన్వీ తన పాత్ర విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తే.. శ్రుతి మాత్రం తనకు నచ్చిన గ్లామర్‌ ప్రదర్శనలో తప్పేమీ లేదని చెప్పకనే చెప్పింది.

మళ్లీ చర్చలోకి ‘పెద్ది’..

సినిమాల్లో హీరోయిన్ల గ్లామర్‌ ప్రదర్శన ఎప్పటి నుంచో చర్చనీయాంశమే. కథకు అవసరమా? పాత్రకు ఎంతవరకు ప్రాధాన్యం ఉంది? అనే విషయాలపై ప్రేక్షకుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు జాన్వీ వ్యాఖ్యలు, శ్రుతి సమాధానంతో ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ల పాత్రలు, గ్లామర్‌ ప్రదర్శనపై మరోసారి చర్చ మొదలైంది.

Advertisement
Advertisement