త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Smartphone Battery | ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చుకోండి!

Smartphone Battery | ఫోన్ ఉపయోగించకపోయినా బ్యాటరీ వేగంగా తగ్గిపోతుంటే కొన్ని సెట్టింగ్స్ కారణం అవుతాయ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వైఫై, బ్లూటూత్ స్కానింగ్, అధిక బ్యాటరీ వినియోగించే యాప్స్, నిరంతర నోటిఫికేషన్లు బ్యాటరీ బ్యాకప్‌ను తగ్గిస్తాయ‌ని అంటున్నారు. మూడు సెట్టింగ్స్‌లో మార్పులు చేయడం ద్వారా అనవసరమైన బ్యాటరీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

S

Technology | Published On Nov 25, 2026, 2.37 pm IST

Smartphone Battery | ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చుకోండి!
Advertisement

Smartphone Battery | ఫోన్ ఉపయోగించకపోయినా బ్యాటరీ వేగంగా తగ్గిపోతుంటే కొన్ని సెట్టింగ్స్ కారణం అవుతాయ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వైఫై, బ్లూటూత్ స్కానింగ్, అధిక బ్యాటరీ వినియోగించే యాప్స్, నిరంతర నోటిఫికేషన్లు బ్యాటరీ బ్యాకప్‌ను తగ్గిస్తాయ‌ని అంటున్నారు. మూడు సెట్టింగ్స్‌లో మార్పులు చేయడం ద్వారా అనవసరమైన బ్యాటరీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

బ్యాక్‌గ్రౌండ్ స్కానింగ్‌..

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బ్యాటరీ త్వరగా ఖాళీ అవడం ఒకటి. ముఖ్యంగా ఫోన్ ఉపయోగించకపోయినా ఛార్జింగ్ తగ్గిపోతుంటే అందుకు కొన్ని బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్స్ కారణం అవుతాయి. వాటిల్లో మొదటిది బ్యాక్‌గ్రౌండ్ స్కానింగ్. ఫోన్‌లో వైఫై, బ్లూటూత్ ఆఫ్ చేసినప్పటికీ సమీపంలోని నెట్‌వర్క్‌లు, పరికరాల కోసం అవి బ్యాక్‌గ్రౌండ్‌లో స్కానింగ్ చేస్తుంటాయి. దీనిని నిలిపివేయడానికి సెట్టింగ్స్‌లో లొకేషన్ లో ఉండే లొకేషన్ సర్వీసెస్‌లోకి వెళ్లి వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ ఆప్షన్లను ఆఫ్ చేయాలి. అలాగే అధిక బ్యాటరీ వినియోగించే యాప్స్. ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తోందో తెలుసుకోవడానికి సెట్టింగ్స్‌లో బ్యాటరీ విభాగాన్ని తెరిచి బ్యాటరీ యూసేజ్‌ను పరిశీలించాలి. అందులో మొదటి స్థానంలో కనిపించే యాప్ అత్యధిక బ్యాటరీని వినియోగిస్తున్నట్లు గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని పరిమితం చేయాలి.

నోటిఫికేష‌న్లు..

అధిక నోటిఫికేషన్ల వ‌ల్ల కూడా బ్యాట‌రీ త్వ‌ర‌గా ఖాళీ అవుతుంది. వార్తలు, షాపింగ్, గేమింగ్ యాప్స్ నుంచి రోజంతా వచ్చే నోటిఫికేషన్లు కూడా బ్యాటరీ వినియోగాన్ని పెంచుతాయి. అవసరం లేని యాప్స్ నోటిఫికేషన్లను నిలిపివేయడానికి సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ విభాగానికి వెళ్లి సంబంధిత యాప్‌ను ఎంచుకుని వాటిని ఆఫ్ చేయాలి. అయితే ఈ మూడు మార్పులు చేసిన తర్వాత బ్యాటరీ వినియోగంలో గణనీయమైన తేడా కనిపించే అవకాశం ఉంటుంది. అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ కార్యకలాపాలు, యాప్స్ వినియోగం, నోటిఫికేషన్లను నియంత్రించడం ద్వారా ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఈ మూడు సెట్టింగ్స్ మార్చుకుంటే దాదాపు వెంటనే మార్పును గమనించవచ్చు.

Advertisement
Advertisement