త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | న‌గ‌ర‌మంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిప‌డాలి

CM Revanth Reddy | ఖేలో ఇండియా పోటీల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిప‌డేలా ఏర్పాట్లు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. డిసెంబ‌ర్ 11 నుంచి 22వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న ఖేలో ఇండియా పోటీల నిర్వ‌హ‌ణ‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

S

Telangana | Published On Nov 25, 2026, 3.04 pm IST

CM Revanth Reddy | న‌గ‌ర‌మంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిప‌డాలి
Advertisement

ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ఖేలో ఇండియా పోటీల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిప‌డేలా ఏర్పాట్లు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. డిసెంబ‌ర్ 11 నుంచి 22వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న ఖేలో ఇండియా పోటీల నిర్వ‌హ‌ణ‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు.

డిసెంబర్ 11న అట్టహాసంగా ఖేలో ఇండియా పోటీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు, గచ్చిబౌలిలో ముగింపు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని ఇంచార్జిలుగా నియమించి బాధ్యులను చేయాలని సూచించారు.

పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాలవారీగా మంత్రులను ఇంచార్జ్‌లుగా నియమించాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచన చేశారు. మహబూబ్ నగర్ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ పరిధిలో అడ్లూరి లక్ష్మణ్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాల‌ని చెప్పారు. ఖమ్మం పరిధిలో తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పరిధిలో సుదర్శన్ రెడ్డిని పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు బాధ్యతలు ఇవ్వాలని సూచించారు.

క్రీడా పోటీలకు వచ్చే ఆహ్వానితులు, క్రీడాకారులకు అందించే ఆహారం, అకామిడేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేద‌న్నారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలో బెస్ట్ కోచ్‌లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement