Pune court | హత్య కేసు నిందితుడిపై కోర్టు ఆవరణలో దాడి.. కత్తులతో నరికి
Pune court | పూణెలోని కోర్టు (Pune court) ఆవరణలో దారుణం చోటు చేసుకుంది. కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన నిందితుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో (machete) దాడి చేశారు (murder accused was attacked). ఈ దాడిలో నిందితుడి చెయ్యి తెగిపడింది.
Pune court | త్రినేత్ర న్యూస్ : మహారాష్ట్రలోని పూణె కోర్టు (Pune court) ఆవరణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ హత్య కేసు నిందితుడిపై దుండగులు అత్యంత కిరాతకంగా దాడికి (murder accused was attacked) పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో నిందితుడి చెయ్యి తెగిపడింది. దీంతో అతడు రక్తపు మడుగుల్లో అక్కడే కుప్పకూలిపోయాడు.
నిందితుడిని మందార్ మారుతి కివ్లేగా (Mandar Maruti Kivle) గుర్తించారు. భూమి, ఆర్థిక వివాదాల నేపథ్యంలో 2025 ఏప్రిల్‌లో పూణెలోని సంతోష్‌నగర్ కత్రాజ్ ప్రాంతంలో శుభమ్ సుభాష్ చవాన్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో కివ్లే జైలుకు వెళ్లాడు. నాలుగు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన అతను.. కేసు విచారణ నిమిత్తం ఇవాళ కోర్టుకు హాజరయ్యాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దుండగులు కివ్లేపై దాడి చేశారు. కత్తులతో (machete) విచక్షణారహితంగా దాడి చేసి అనంతరం కాల్పులు జరిపారు. ఈ దాడిలో కివ్లే చెయ్యి తెగిపడిపోయింది.
ఈ దాడితో కోర్టు ఆవరణలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టుకు వచ్చిన సామాన్య ప్రజలు, న్యాయవాదులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగుల్లో పడిఉన్న కివ్లేని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
మేం బిచ్చగాళ్లం కాదు.. యూపీ ఎన్నికల వేళ ఇండీ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చుకోండి!
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి
- ●Indian Rare Earth Stocks | 2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..
- ●ACB | ఏసీబీలో అవినీతికి ఆస్కారం లేదు.. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ
- ●Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్ మాత్రం హ్యాపీ!
- ●Smartphone Battery | ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చుకోండి!
- ●TGHRC | బాచుపల్లిలో ఎస్టీపీ క్లీన్ చేస్తుండగా ముగ్గురు మృతి.. సుమోటోగా విచారణకు స్వీకరించిన టీజీహెచ్ఆర్సీ

CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి

Indian Rare Earth Stocks | 2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..

ACB | ఏసీబీలో అవినీతికి ఆస్కారం లేదు.. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ

Peddi Movie | జాన్వీ అసంతృప్తి.. శ్రుతిహాసన్ మాత్రం హ్యాపీ!




