Vattikuti Ramarao Goud | ఎమ్మెల్సీ టికెట్ నాకే ఇవ్వండి.. మంత్రి ఉత్తమ్‌కు వట్టికూటి విజ్ఞప్తి
Vattikuti Ramarao Goud | నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల్లో హడావుడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆశావహులు టికెట్లు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన పేరును పరిశీలించాలని టీ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్.. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Vattikuti Ramarao Goud | త్రినేత్ర న్యూస్ : నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల్లో హడావుడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆశావహులు టికెట్లు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన పేరును పరిశీలించాలని టీ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్.. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మూడు దశాబ్దాలుగా విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా జైలుకు వెళ్లి, అనేక కేసులు ఎదుర్కొన్నాను. ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ9లలో జర్నలిస్టుగా, హైకోర్టు న్యాయవాదిగా, సుప్రీంకోర్టు ఎన్ రోల్డ్ అడ్వకేట్‌గా ఉన్నాను. అనేక సామాజిక, వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలక పోరాటాలు చేశాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇవ్వగలరని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వట్టికూటి రామారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్ ఉన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold Rings | ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన శిశువులకు బంగారం ఉంగరాలు
- ●LPU Students Protest | పంజాబ్ ఎల్పీయూలో హైటెన్షన్: మిగ్-23 ఎక్కి విద్యార్థుల నిరసన.. అసలు ఏం జరిగింది?
- ●Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..
- ●Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు
- ●Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి - రామాయణ పోస్టర్ రిలీజ్ - విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ

Gold Rings | ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన శిశువులకు బంగారం ఉంగరాలు

LPU Students Protest | పంజాబ్ ఎల్పీయూలో హైటెన్షన్: మిగ్-23 ఎక్కి విద్యార్థుల నిరసన.. అసలు ఏం జరిగింది?

Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి

Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..





