Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల సమయంలో సూర్యుడు రాశిని మార్చుకోనున్నాడు. జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెల 17న సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో శారదీయ నవరాత్రులు కొనసాగుతాయి.
Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల సమయంలో సూర్యుడు రాశిని మార్చుకోనున్నాడు. జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెల 17న సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో శారదీయ నవరాత్రులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో సూర్యుడి గోచారం, దుర్గాదేవి ఆరాధన కలయిక కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కొందరికి ఆర్థిక లాభాలు, కోరుకున్న ఉద్యోగం, విజయాలు, గౌరవం లభించే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉండనున్నది. ఆ మూడురాశులేంటో తెలుసుకుందాం రండి..!
కన్యా రాశి
సూర్యుడి సంచారం కారణంగా కన్యారాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. దుర్గాదేవి అనుగ్రహంతో ఈ సమయంలో అదృష్టం కలిసివచ్చే అవకాశాలు ఉంటాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ, వృత్తి పరంగా చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను వచ్చే ఛాన్స్ ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసిన కృషికి ఫలితాలు భవిష్యత్తులో కనిపించే అవకాశం ఉంది. సాధారణం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మీ ప్రియురాలితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది.
తులా రాశి
సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ రాశి వారికి ఈ సమయం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కూడా ఈ సమయంలో అదృష్టం కలిసివస్తుంది. దాంతో కొత్త అవకాశాలు లభించడంతో పాటు లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో ఏర్పడిన పరిచయాలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రయోజనం ఉంటుంది. మీ పని, తీసుకునే నిర్ణయాలతో ప్రశంసలు పొందుతారు. గతంలో పనిచేసిన పాత క్లయింట్, వ్యాపార సంబంధిత వ్యక్తులతో మళ్లీ కలిసి పని చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం ఉంటుంది. దాంతో ఉత్సాహంగా ఉంటారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...
- ●Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!

Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు






