Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ – రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన రెండు తెలుగు సినిమాలు రెండు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. క్రేజీ కళ్యాణం మూవీ అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతుండగా...భోగి సినిమా నవంబర్ 12న విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందడం గమనార్హం.
Entertainment | Published On Oct 4, 2026, 5.12 pm IST
Anupama Parameswaran | తెలుగు ఆడియెన్స్‌కు అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్‌లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందడం గమనార్హం.
భోగి టీజర్
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన భోగి టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్ అంశాలతో ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్‌లో పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ పాత్రలతో అనుపమ పరమేశ్వరన్ కనిపించింది. శర్వానంద్, అనుపమ లుక్స్, వారిద్దరి ట్రాన్స్‌ఫర్మేషన్, మేకోవర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ నేపథ్యం...
టీజర్‌తో పాటు భోగి మూవీ రిలీజ్ డేట్‌ను ఆదివారం మేకర్స్ వెల్లడించారు. నవంబర్ 12న ఈ యాక్షన్ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి సంపత్‌నంది దర్శకత్వం వహించారు.
క్రేజీ కళ్యాణం...
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన మరో తెలుగు మూవీ క్రేజీ కళ్యాణం విడుదల తేదీ కూడా ఖరారైంది.
అక్టోబర్ 30న ఈ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. క్రేజీ కళ్యాణం సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు తరుణ్ భాస్కర్, నరేష్ వీకే, అఖిల్ ఉద్దెమారి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు.
అల సెంద్రవంక...
క్రేజీ కళ్యాణం నుంచి 'అల సెంద్రవంకస అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకు గోరటి వెంకన్న లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి సాంగ్‌ను పాడారు. 'అందం మురిసే, గంధం కురిసే పిల్లా నీ మేని సొగసులనే చూసి...అంటూ బ్యూటిఫుల్ లిరిక్స్‌తో ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది.
తెలంగాణ పెళ్లి వేడుకల వెనకున్న సరదాలు, సంతోషాలతో క్రేజీ కళ్యాణం మూవీ రూపొందుతోంది. ఇందులో తెలంగాణ అమ్మాయిగా అనుపమ కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ – రా అండర్ రస్టిక్ కథతో …
అక్టోబర్ 4, 2026

Vijay Deverakonda | లైంగిక దాడితో సమానం …జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ రియాక్షన్
అక్టోబర్ 4, 2026

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ – రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ – తెలంగాణ అమ్మాయిగా అనుపమ
అక్టోబర్ 4, 2026
తాజావార్తలు
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...
- ●Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం
- ●Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం
- ●Devano Sathish Madiga | మీ పార్టీలు మా వాడలకొస్తే మైల పడవా? మేం ఓట్లేస్తే మీ గుర్తులు మైల పడవా?
- ●Nasha Mukt Yuva | చార్మినార్ వద్ద “నషా ముక్త్ యువ” వాక్‌థాన్

Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు

Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం

Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం



