Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
Mahabubnagar | ఓ ఏడాదిన్నర వయసున్న బాలుడు బిస్కెట్ తింటుండగా, గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చనిపోయాడు.
Mahabubnagar | త్రినేత్ర న్యూస్ : ఓ ఏడాదిన్నర వయసున్న బాలుడు బిస్కెట్ తింటుండగా, గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చనిపోయాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలో వెలుగు చూసింది.
మూసాపేట మండలం సుర్తి తండాకు చెందిన మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు సంతానం. అయితే శనివారం రాత్రి ఇద్దరు పిల్లలకు తల్లి బిస్కెట్లు ఇచ్చి వంట పనిలో నిమగ్నమైంది. ఏడాదిన్నర వయసున్న బాలుడికి బిస్కెట్ గొంతులో ఇరుక్కుపోయింది. గొంతులో బిస్కెట్ అడ్డురావడంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాబు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బిడ్డ మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుర్తి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సంబంధిత వార్తలు

Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
అక్టోబర్ 3, 2026

Murder | కష్టపడి జీవించమన్నందుకు కన్న తండ్రిని చంపిన కొడుకు
సెప్టెంబర్ 28, 2026

Hyderabad | మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...
- ●Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం
- ●Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం
- ●Devano Sathish Madiga | మీ పార్టీలు మా వాడలకొస్తే మైల పడవా? మేం ఓట్లేస్తే మీ గుర్తులు మైల పడవా?
- ●Nasha Mukt Yuva | చార్మినార్ వద్ద “నషా ముక్త్ యువ” వాక్‌థాన్

Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు

Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...

Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం

Russian Drone Attack Sumy | ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ల బీభత్సం: ఇండియన్ ఫార్మా ప్లాంట్ ధ్వంసం.. ఒకరు మృతి, రూ.400 కోట్ల నష్టం



