త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | పెద్ది డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ మూవీ – రా అండ‌ర్ ర‌స్టిక్ క‌థ‌తో …

పెద్ది త‌ర్వాత డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా త‌న త‌దుప‌రి సినిమా మెగాహీరోతోనే చేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి, బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఫిక్సైన‌ట్లు చెబుతోన్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

N

Entertainment | Published On Oct 4, 2026, 4.46 pm IST

Chiranjeevi | పెద్ది డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ మూవీ – రా అండ‌ర్ ర‌స్టిక్ క‌థ‌తో …
Advertisement

Chiranjeevi | రామ్‌చ‌ర‌ణ్ పెద్ది త‌ర్వాత త‌న త‌దుప‌రి సినిమాను మెగా హీరోతోనే చేయ‌బోతున్నారు డైరెక్ట‌ర్‌ బుచ్చిబాబు సానా. పెద్ది సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచినా బుచ్చిబాబు సానా టేకింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తాను అనుకున్న క‌థ‌ను నిజాయితీగా స్క్రీన్‌పై ఆవిష్క‌రించాడంటూ అభిమానుల‌తో పాటు సెలిబ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపించారు. క్రికెట‌ర్‌, రెజ్ల‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ను చూపించిన తీరు, ఎమోష‌న్స్, యాక్ష‌న్ సీన్స్‌ను వైవిధ్యంగా మ‌లిచిన విధానం బాగున్నాయంటూ కామెంట్స్ వ‌చ్చాయి. న‌ట‌న ప‌రంగా రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌ల‌లో ఒక‌టిగా పెద్ది నిలిచింది.

మెగా హీరోతో...

పెద్ది త‌ర్వాత బుచ్చిబాబు సానా నెక్స్ట్ మూవీ కూడా మెగా హీరోతోనే ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ క‌న్ఫామ్ అయిన‌ట్లు చెబుతోన్నారు. పెద్ది సినిమా విష‌యంలో డైరెక్ట‌ర్ ప‌నితీరుకు ఇంప్రెస్ అయిన చిరంజీవి ఓ క‌థ రెడీ చేసుకోమ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా రా అండ‌ర్ ర‌స్టిక్ పాయింట్‌తో స్టోరీ రాసుకున్న బుచ్చిబాబు...ఇటీవ‌లే మెగాస్టార్‌ను క‌లిసి వినిపించిన‌ట్లు స‌మాచారం. చిరంజీవికి కూడా క‌థ‌తో పాటు అందులోని ఎమోష‌న్స్ బాగా న‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోమ‌ని చెప్పిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి...

ప్ర‌స్తుతం చిరంజీవి కాకా సినిమా చేస్తోన్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. కాకా రిలీజైన త‌ర్వాత వ‌చ్చే ఏడాది వేస‌వి నుంచి చిరంజీవి, బుచ్చిబాబు సానా మూవీ సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.
బుచ్చిబాబు గ‌త సినిమాల త‌ర‌హాలోనే రియ‌లిస్టిక్ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ భారీ బ‌డ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. కాకాతో పాటు చిరంజీవి విశ్వంభ‌ర కూడా వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

 

Advertisement
Advertisement