Lucky Restaurant Issue | మా హోటల్‌ను తిరుపతిరెడ్డి లాక్కోవాలని చూస్తున్నడు
Lucky Restaurant Issue | తమ హోటల్‌ను ఇయ్యమని చెప్తే సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు అనుముల తిరుపతిరెడ్డి అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని లక్కీ రెస్టారెంట్ ఓనర్ రెహానా ఆరోపించారు.
- రైడ్ చేపించి సీజ్ చేయించాడు.. లైసెన్స్‌లూ రద్దు చేయించాడు
- మాదాపూర్ లక్కీ రెస్టారెంట్ ఓనర్ రెహానా సంచలన ఆరోపణలు
Lucky Restaurant Issue | త్రినేత్ర న్యూస్: తమ హోటల్‌ను ఇయ్యమని చెప్తే సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు అనుముల తిరుపతిరెడ్డి అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని లక్కీ రెస్టారెంట్ ఓనర్ రెహానా ఆరోపించారు. ఆయనకు నచ్చిన హోటళ్లపై కన్నేసి, వాటిని దక్కించుకోవడానికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ను ఒక సాధనంగా వాడుకుంటున్నారన్నారు. తమ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులతో రైడ్ చేయించి హోటల్‌ను సీజ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరుకు ఆమె తాజాగా నిరసనకు దిగారు.
హోటల్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో జేసీబీ (JCB) యంత్రాలను పంపి, లక్కీ రెస్టారెంట్ ముందు భాగాన్ని ధ్వంసం చేయించారు. విద్యుత్, నీటి కనెక్షన్లను కట్ చేసి లైసెన్సులు రద్దు చేయించారు. సెటిల్మెంట్ కోసం వారి ఆఫీసుకు పిలిపించారు. మా తండ్రి, సోదరుడిని కిడ్నాప్ చేయించారు.
గత 6 ఏళ్లుగా అన్ని రకాల అద్దెలు, జీఎస్టీ-టీడీఎస్ (GST-TDS) టైంకు కడుతున్నాం. సరైన సమయానికి చెల్లిస్తూ నడుపుకుంటున్న హోటల్‌ను ఇలా అక్రమంగా లాక్కోవాలని చూస్తున్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు అయితే అబద్దం చెప్పవు కదా? 3 లక్షల 70 వేల రెంట్ కట్టాను. నా బిడ్డ యూనివర్సిటీలో చదువు కోసం ఫీజు డబ్బులు లేక నెల రోజులు ఇంట్లో కూర్చున్నాడు. హోటల్ నడిస్తే ఫీజు కడతానని చెప్పిన. అధికారులు మాకు న్యాయం చేయాలి. అయితే, ఈ ఆరోపణలపై ఇటు తిరుపతి రెడ్డి గానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులు గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అరాచకాల గురించి బాధితుల మాటల్లో... https://t.co/oxqNoEDwpv
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026
తాజావార్తలు
- ●Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి
- ●Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్
- ●India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!
- ●Chiranjeevi | పెద్ది డైరెక్టర్‌తో మెగాస్టార్ మూవీ - రా అండర్ రస్టిక్ కథతో ...
- ●Minister Sridhar Babu | తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం

Mahabubnagar | గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఏడాదిన్నర బాలుడు మృతి

Lucky Zodiac Signs | శారదీయ నవరాత్రుల్లో సూర్య సంచారం.. ఈ మూడురాశుల వారికి శుభ ఫలితాలు!

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్ - రెండు వారాల గ్యాప్‌లో రెండు తెలుగు సినిమాలు రిలీజ్

India Nuclear Weapons | శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ అణుబలం: 190 వార్హెడ్లు.. ఏ మూలకైనా దూసుకెళ్లే మిస్సైల్ నెట్వర్క్!






