త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | రాహుల్‌! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన

Ramchandar Rao | ఈవీఎంలు నిషేధించి పేప‌ర్ బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు పెట్టాల‌ని కాంగ్రెస్ అడుగుతోంద‌ని.. అస‌లు ఈవీఎంలు తెచ్చిందే రాజీవ్‌గాంధీ (Rajeev Gandhi) అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Oct 6, 2026, 7.04 pm IST

Ramchandar Rao | రాహుల్‌! ఈవీఎంలు తెచ్చిందే మీ నాయిన

సంక్షిప్త సారాంశం

2018లో స్వయంగా రాహుల్ గాంధీ, అభిషేక్ మను సింఘ్వీలే తెలంగాణలో 70 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయ‌ని మొత్తుకోలేదా? ఇప్పుడు ప్రక్షాళన చేస్తుంటే ఉలికిపాటు ఎందుకు? ఫేక్ ఓట్లు తీసేయాల‌ని, తెలంగాణ‌లోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్ష ఫేక్ ఓట్లు ఉన్నాయ‌ని 2018లోనే రాహుల్ గాంధీ చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 60 ల‌క్ష‌ల ఫేక్ ఓట్లున్నాయ‌ని క‌మ‌ల్‌నాథ్, రాజ‌స్థాన్‌లో 45 ల‌క్ష‌ల ఫేక్ ఓట్లున్నాయ‌ని స‌చిన్ పైల‌ట్ చెప్పారు. వాట‌న్నింటిని రిమూవ్ చేయాల్సిన బాధ్య‌త ఉందా లేదా?

Advertisement
  • మీరు ఓడిపోతే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మీద ఏడ‌వ‌డం న్యాయంగా ఉందా?
  • తెలంగాణలో 70 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయ‌ని మీరే మొత్తుకోలేదా? ఇప్పుడు తీసేస్తుంటే ఎందుకు ఆగ‌మైతున్న‌రు
  • ఫారమ్-6, ఫారమ్-7లు సబ్‌మిట్ చేసినంత మాత్రాన ఓట్లు పోవు
  • ఏళ్ల తరబడి నకిలీ, బోగస్ ఓట్లతో ల‌బ్ధి పొందింది ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ధ్వ‌జం

Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: ఈవీఎంలు నిషేధించి పేప‌ర్ బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు పెట్టాల‌ని కాంగ్రెస్ అడుగుతోంద‌ని.. అస‌లు ఈవీఎంలు తెచ్చిందే రాజీవ్‌గాంధీ (Rajeev Gandhi) అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ ఓడిపోతే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మీద ప‌డి ఏడ‌వడం న్యాయంగా ఉందా అని ప్ర‌శ్నించారు. బోగ‌స్ ఓట్లు ఉన్నాయ‌ని చెప్పిందే కాంగ్రెస్ నాయ‌కుల‌న్నారు. ఫారమ్-6, ఫారమ్-7లు సబ్‌మిట్ చేసినంత మాత్రాన ఓట్లు పోవని తేల్చి చెప్పారు. ఏళ్ల తరబడి నకిలీ, బోగస్, డూప్లికేట్ ఓట్లతో ల‌బ్ధి పొందింది ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే అని ఆరోపించారు. నాంప‌ల్లిలోని పార్టీ ఆఫీసులో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు.

ఓటు చోరీతోనే ఎంపీ అయ్యారా?

2018లో స్వయంగా రాహుల్ గాంధీ, అభిషేక్ మను సింఘ్వీలే తెలంగాణలో 70 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయ‌ని మొత్తుకోలేదా? ఇప్పుడు ప్రక్షాళన చేస్తుంటే ఉలికిపాటు ఎందుకు? ఫేక్ ఓట్లు తీసేయాల‌ని, తెలంగాణ‌లోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ల‌క్ష ఫేక్ ఓట్లు ఉన్నాయ‌ని 2018లోనే రాహుల్ గాంధీ చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 60 ల‌క్ష‌ల ఫేక్ ఓట్లున్నాయ‌ని క‌మ‌ల్‌నాథ్, రాజ‌స్థాన్‌లో 45 ల‌క్ష‌ల ఫేక్ ఓట్లున్నాయ‌ని స‌చిన్ పైల‌ట్ చెప్పారు. వాట‌న్నింటిని రిమూవ్ చేయాల్సిన బాధ్య‌త ఉందా లేదా?

2025, జూన్‌ 24 బీహార్‌లో ఎస్ఐఆర్ జ‌రిగింది. అది ఇనానిమ‌స్ ఆఫ్ ది అప్రూవ‌ల్ క‌మిష‌న్‌ అయింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా స‌మ‌ర్థించింది. అయితే వీళ్లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. 2.8 కోట్ల మంది చనిపోతే రిమూవ్ చేశార‌ని వాళ్లే అన్నారు. మ‌రి చ‌నిపోయిన‌వాళ్ల‌వి డిలీట్ చేయాలా వ‌ద్దా? రాహుల్ గాంధీ ఓటు చోరీతోనే ఎంపీ అయ్యారా? తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, హ‌మాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఓటు చోరీతోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసిందా?

రోహింగ్యాలు, బంగ్లా దేశీయుల‌వి క‌చ్చితంగా తీసేస్తాం..

1952 నుంచి 2014 వ‌ర‌కు 12 సార్లు ఎస్ఐఆర్ నిర్వ‌హించారు. అప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఉండే. మరి అవి ఇల్లీగ‌లేనా? మీరు ఓడిపోతే మాత్రం ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తారుమారు చేసింద‌ని అన‌డం న్యాయంగా ఉందా? ఈవీఎంల మీద కూడా అడుగుతున్నారు. నేను రాహుల్‌ను అడుగుతున్నా.. అవి ప‌రిచ‌యం చేసింది ఎవ‌రు? ఈవీఎంల‌ను మీ నాయిన రాజీవ్‌గాంధే తీసుకొచ్చారు. మీ నాయిన‌నే అవమానిస్తే ఎట్ల‌? ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్షాళన జరుగుతుండటంతో, తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు ముప్పు ఏర్పడుతోందన్న భయంతో వారు ఉలికిపడుతున్నారు. భారతదేశ పౌరుల ఓటు హక్కును ఎవరూ తీసేయలేరు.. కానీ బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ ఓట్లను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు!

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే గుడ్డి ఆరాటంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, చివరకు రాష్ట్రపతి కార్యాలయం వంటి రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై ప్రజల్లో విషం చిమ్ముతున్నారు. గెలిస్తే ఎన్నికల సంఘం గొప్పది.. ఓడిపోతే ఈవీఎంలు, సంస్థలు తప్పా? కాంగ్రెస్ దిగజారుడు ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ఫారమ్-6, ఫారమ్-7లను భూతంలా చూపిస్తూ తప్పుడు ప్రచారం.. ఫారమ్ సబ్మిట్ చేసినంత మాత్రాన ఓట్లు తొలగిపోవు, విచారణ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు అని రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement