త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | బావిలో దూకి.. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Suicide | వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని పరిగి మండలం రావులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్న‌ది.

G

Telangana | Published On Oct 10, 2026, 10.14 am IST

Suicide | బావిలో దూకి.. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
Advertisement

Suicide | త్రినేత్ర న్యూస్‌: వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని పరిగి మండలం రావులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్న‌ది. చ‌ర‌ణ్‌ అనే యువకుడు.. ఆ యువతికి ఫోన్‌ చేసి వేధించడంతోనే (Harassment) అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి బయటకు రావాలంటూ చరణ్.. యువ‌తికి పదే పదే ఫోన్లు చేసినట్లు తెలుస్తున్న‌ది. దీంతో అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె ఊరి చివ‌ర్లోని బావిలో దూకి ప్రాణాలు తీసుకుందని వెల్ల‌డించారు.

సమాచారం అందున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ఈతగాళ్ల సాయంతో యువతి మృతదేహాన్ని బాలిలో నుంచి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం పరిగి (Parigi) ప్రభుత్వ ద‌వాఖాన‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి విష‌యాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement