Software Employee Suicide | ఒంటరిగా ఉండలేక.. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య.. ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్ నోట్‌లో ఇంకేముందంటే!
Software Employee Suicide | ఆమె పెళ్లయిన ఏడాదిన్నరకే భర్త నుంచి విడిపోయింది. అప్పటినుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఒంటరి లైఫ్‌ను లీడ్ చేస్తూ వచ్చింది. గత నాలుగు నెలలుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తనువు చాలించింది.
Software Employee Suicide | త్రినేత్ర న్యూస్: ఆమె పెళ్లయిన ఏడాదిన్నరకే భర్త నుంచి విడిపోయింది. అప్పటినుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఒంటరి లైఫ్‌ను లీడ్ చేస్తూ వచ్చింది. గత నాలుగు నెలలుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad)లోని మియాపూర్ (Miyapur)లో చోటుచేసుకుంది.
మియాపూర్ ఎస్‌ఐ నర్సింహా రెడ్డి ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన వెంకట్ రెడ్డి, పద్మ దంపతులకు ఓ కుమార్తె బక్కశెట్టి సింధూజ (Sindhuja) అలియాస్ తుషారిక (36), ఓ కుమారుడు ఉన్నారు. సింధూజకు 2015లో పెళ్లి కాగా ఏడాదిన్నర తర్వాత భర్త నుంచి విడిపోయింది. దీంతో ఒంటరిగానే జీవనం కొనసాగిస్తోంది. హైటెక్ సిటీలోని నెక్స్ట్‌టర్న్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసముంటోంది.
ఈ క్రమంలో సింధూజ పనిచేస్తున్న కంపెనీలో ఆమె స్నేహితుడు రాజిరెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ రాడ్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు చేరుకొని ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనాథ పిల్లలకే ఆస్తి చెందాలని సూసైడ్ నోట్..
నాలుగు నెలలుగా తాను ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా. ఈ బాధల నుంచి బయటపడలేకపోతున్నా. నాకు పిల్లలు అంటే ఇష్టం.. నా బ్యాంకు ఖాతాలోని డబ్బులు అనాథ పిల్లలకే చెందాలి. కోర్టులో వివాదంలో ఉన్న ఆస్తికి సంబంధించిన కేసులను కొనసాగించాలి. నా ఆస్తి మొత్తాన్ని కేర్ ట్రస్ట్‌కు అందేలా చూడాలి అని సింధూజ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నది.
తాజావార్తలు
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు



