త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HIV Blood | పెళ్లికి నిరాక‌రించింద‌ని.. యువ‌తికి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన యువ‌కుడు

HIV Blood | ఇటీవ‌లే విడుద‌లైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా లాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో వెలుగు చూసింది. ఆ సినిమాలో తండ్రి బిడ్డ‌కు హెచ్ఐవీ ర‌క్తాన్ని ఎక్కిస్తే.. ఈ ఘ‌ట‌న‌లో మాత్రం ప్రియుడు త‌న ప్రియురాలికి హెచ్ఐవీ ర‌క్తాన్ని ఎక్కించాడు.

S

Telangana | Published On Mar 14, 2026, 4.03 pm IST

HIV Blood | పెళ్లికి నిరాక‌రించింద‌ని.. యువ‌తికి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన యువ‌కుడు
Advertisement

HIV Blood | త్రినేత్ర‌.న్యూస్ : వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారు. వారి ప్రేమ‌పెళ్లికి ఇరు కుటుంబాల పెద్ద‌లు కూడా అంగీక‌రించారు. ఈ గ్యాప్‌లో యువ‌కుడికి ఎయిడ్స్ ఉంద‌ని తేల‌డంతో యువ‌తి పెళ్లికి నిరాక‌రించింది. తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన బాధితుడు హెచ్ఐవీ ర‌క్తాన్ని ఆమెకు ఎక్కించాడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని పోచారం ఐటీ కారిడార్ పీఎస్ ప‌రిధిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పోచారం ఐటీ కారిడార్ పీఎస్ ప‌రిధిలోని మ‌నోహ‌ర్ అనే యువ‌కుడు గ‌త కొంత‌కాలంగా ఓ యువ‌తిని ప్రేమిస్తున్నాడు. ఇరువురి మ‌న‌సులు ఏకం కావ‌డంతో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. పెద్ద‌ల‌ను కూడా ఒప్పించారు. ఇరు కుటుంబాలు అంగీకారం తెల‌ప‌డంతో.. పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. ఈ లోపు మ‌నోహ‌ర్ త‌ల్లిదండ్రులిద్ద‌రూ ఎయిడ్స్ వ్యాధిగ్ర‌స్తుల‌ని యువ‌తి తెలుసుకుంది. మ‌నోహ‌ర్ కూడా హెచ్ఐవీతో బాధ‌ప‌డుతున్న‌ట్లు గ్ర‌హించింది. దీంతో అత‌నితో పెళ్లికి నిరాక‌రించింది.

తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన మ‌నోహ‌ర్.. ఈ నెల 11న యువ‌తి ఇంటికి వెళ్లి.. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి తెచ్చాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. చివ‌ర‌కు హెచ్ఐవీ ర‌క్తంతో కూడి ఇంజెక్ష‌న్ ఇచ్చాడు. బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, మ‌నోహ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

 

Advertisement
Advertisement