Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు
Tenant Farmers Report | ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ దువ్వూరు నరసింహారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ.. కౌలు రైతుల సమస్యలపై మంగళవారం నివేదికను వెల్లడించింది. గత నెలలో 22 జిల్లాల్లో 47 మండలాల్లో 57 గ్రామాల్లో 1816 మంది రైతులతో వ్యక్తిగతంగా మాట్లాడి నివేదిక రూపొందించారు.
- రుణాలు రావు.. పరిహారం అందదు
- ఇదీ... 22 లక్షల మంది కౌలు రైతుల దుస్థితి
- రాష్ట్రంలో 36% మంది కౌలు రైతులే
- వారికి గుర్తింపు కార్డులివ్వాల్సిందే
- వారికీ సంక్షేమ పథకాలు అందాల్సిందే
- వెల్లడించిన తెలంగాణ కౌలు రైతుల సర్వే నివేదిక
Tenant Farmers Report | త్రినేత్ర.న్యూస్ : దాదాపుగా 22 లక్షల మంది రైతులకు సబ్సిడీ యూరియా రాదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వారు పంట అమ్ముకోలేరు. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు అందవు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే.. ఆ నష్ట పరిహారం కూడా వారి చేతికి అందదు. ఇదీ రాష్ట్రంలో కౌలు రైతుల దుస్థితి. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ దువ్వూరు నరసింహారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ.. కౌలు రైతుల సమస్యలపై మంగళవారం నివేదికను వెల్లడించింది. గత నెలలో 22 జిల్లాల్లో 47 మండలాల్లో 57 గ్రామాల్లో 1816 మంది రైతులతో వ్యక్తిగతంగా మాట్లాడి చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.

కౌలు రైతులు 22 లక్షల మంది..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగుభూమి ఉంది. సుమారు 70 లక్షల మందికి పైగా రైతుల పేరిట పట్టా పాస్ బుక్ లు ఉన్నాయి. రైతు భరోసా కూడా పొందుతున్నారు. కాగా 36 శాతం మంది (22 లక్షల మంది ) రైతులు కౌలు కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నట్టు 2022లో రైతు స్వరాజ్య నివేదిక చేసిన సర్వేలో వెల్లడైంది. 47.2 శాతం బీసీలు, 26.9 శాతం ఎస్సీలు, 13.9 శాతం ఎస్టీలు, 4.2 శాతం ముస్లింలు, 7.5 శాతం ఓసీ సామాజిక వర్గాలు కౌలు భూమిని కలిగి ఉన్నారు. కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గరిష్టంగా ఎకరాకు 53వేలకు చేరగా, సగటున ఎకరాకు 14,936గా నమోదైంది. 2022లో సగటున కౌలు భూమి 5 ఎకరాలగా ఉండగా..అది ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగింది. ఎకరాకు వచ్చే నికర ఆదాయం తగ్గిపోతుండడం వల్ల కౌలు రైతులు అదనంగా భూమిని కౌలుకు తీసుకొని సాగును విస్తరిస్తున్నారు.

యూరియా బ్లాక్ లో కొనాల్సిందే..
గత యాసంగిలో ప్రవేశపెట్టిన కొత్త యాప్ ఆధారిత విధానం వల్ల కౌలు రైతులకు సబ్సిడీ యూరియా దొరకకుండా పోయింది. ఈ యాప్ లో భూయజమాని ఫోన్ కు వచ్చే ఓటీపీ తప్పనిసరి చేశారు. ఫలితంగా నాలుగో వంతు కౌలు రైతులు మాత్రమే యూరియా సబ్సిడీ పొందగలుగుతున్నారు. ఓ వైపు యూరియా అందుకున్న భూ యజమానులు వాటిని కౌలు రైతులకు ఇవ్వకపోవడంతో ..వారు బ్లాక్ లో రెట్టింపు ధరలకు యూరియాను కొనాల్సి వస్తున్నది.
ఏజెంట్లకు కమీషన్ ఇస్తేనే..
మరోవైపు పంట కొనుగోలులోనూ ఇలాంటి అవరోధాలే ఏర్పడుతున్నాయి. పత్తి, వరి వంటి పంటలను కొనుగోలు చేసేందుకు భూ యజమాని ఓటీపీ తప్పనిసరి. దీంతో కౌలు రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడం అతి కష్టంగా మారింది. సర్వే నివేదిక ప్రకారం కేవలం 6.7 శాతం కౌలు రైతులు మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తిని అమ్ముకోగలిగారు. గత ఏడాది ఖరీఫ్ లో కేవలం 20 శాతం మంది కౌలు రైతులు మాత్రమే వరిని ..ప్రభుత్వానికి అమ్ముకోగలిగారు. భూయజమాని ఓటీపీ నిబంధన వల్ల ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులు ఏజెంట్లకు 10వేల రూపాయలు కమీషన్ చెల్లించుకొని అమ్ముకోవాల్సి వచ్చింది.

నష్టపరిహారం గోవిందా..
సర్వే నివేదిక ప్రకారం.. వరదలు, భారీ వర్షాలు, వడగండ్ల వానల వల్ల 85 శాతం కౌలు రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవిచూశారు. వీరిలో కేవలం 0.7 శాతం మందికి మాత్రమే పంట నష్ట పరిహారం అందింది. చాలా మంది భూ యజమానులే ఈ పరిహారాన్ని అందుకున్నారు. తప్ప..వాటిని కౌలు రైతులకు అందించలేదు. భూ యజమానులకు సున్నా వడ్డీకే లభించే బ్యాంకు పంట రుణాలు కౌలు రైతులకు అసలే లభించడం లేదు.
గుర్తింపు కార్డులతోనే పరిష్కారం..
రాష్ట్రంలో 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కానీ ఆ చట్టం ప్రస్తుతం అమలు కావడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోవడంతో వారికి సబ్సిడీ యూరియా దక్కడం లేదు. వడ్డీ లేని బ్యాంకు రుణాలు అందడం లేదు. ప్రభుత్వానికి పంటను అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు భరోసా , పంట నష్ట పరిహారం .. భూ యజమానుల ఖాతాలోకే వెళ్తుంది. దీంతో అటు పెట్టుబడి సాయం అందక, సబ్సిడీ పథకాలు అందక కౌలు రైతులకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతు మద్దతు కోసం దాదాపు 25వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అయితే ఈ నిధులు...అధికం భూ యజమానులకే అందుతుండడంతో నిజంగా సాగు చేస్తున్న కౌలు రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందజేసి వారికి సాగు సంబంధిత పథకాలను అమలు చేయడంతోనే సమస్య పరిష్కారం అవుతుందని నివేదిక పేర్కొన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
జూన్ 9, 2026

KP Vivekananda | బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం బీఆర్ఎస్ ఘనతే: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
జూన్ 9, 2026

Rakesh Reddy | ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయండి.. డీజీపీని కోరిన నిరుద్యోగులు
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Zojila tunnel | జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూ విజయవంతం
- ●India T20 Series | టీ20 సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్ ఔట్.. ప్రసిద్ కృష్ణకు ఛాన్స్..!
- ●Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
- ●Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
- ●Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..

Uttam Kumar Reddy | రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Zojila tunnel | జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూ విజయవంతం

India T20 Series | టీ20 సిరీస్ నుంచి మహ్మద్ సిరాజ్ ఔట్.. ప్రసిద్ కృష్ణకు ఛాన్స్..!

Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ



