త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta | యాద‌గిరిగుట్ట‌లో 20 నుంచి 22 వ‌ర‌కు కార్తీక ఉత్స‌వం

Yadagirigutta | రాష్ట్రంలోని ఆల‌యాల్లో కార్తీక ఉత్స‌వాల సంద‌డి కొన‌సాగుతోంది. భ‌క్తులు కార్తీక మాసం పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

S

Telangana | Published On Nov 11, 2026, 6.13 am IST

Yadagirigutta | యాద‌గిరిగుట్ట‌లో 20 నుంచి 22 వ‌ర‌కు కార్తీక ఉత్స‌వం
Advertisement

Yadagirigutta | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని ఆల‌యాల్లో కార్తీక ఉత్స‌వాల సంద‌డి కొన‌సాగుతోంది. భ‌క్తులు కార్తీక మాసం పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. యాద‌గిరిగుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి క్షేత్రంలోనూ నవంబ‌ర్ 20 నుంచి 22 వ‌ర‌కు కార్తీక ఉత్స‌వం కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు ఆల‌య అధికారులు రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ క్ర‌మంలో ఆధ్యాత్మిక‌, భ‌క్తి, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఈ నెల 20వ తేదీన మాడుగుల నాగఫణిశర్మ ఆధ్యాత్మిక ప్రవచనం, తేలు విజయ ఆధ్వర్యంలో భక్తి సంగీతం నిర్వ‌హించ‌నున్నారు. 21న ప్రముఖ సంగీత దర్శకులు ఆర్‌.పి.పట్నాయక్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి. 22న పరంపర సంస్థ ఆధ్వర్యంలో అభినేత్రి బృందంతో తెలంగాణ దేవాలయాల ఇతివృత్తంతో ప్రత్యేక నృత్యప్రదర్శన నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. అలాగే ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీలక్ష్మీనరసింహస్వామి నామార్చన సహిత కోటి పుష్పార్చన మహాపర్వాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు.

Advertisement
Advertisement