త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta | యాదగిరిగుట్ట‌లో ఘ‌నంగా కార్తీక‌ మాస ఉత్స‌వాలు

Yadagirigutta | యాద‌గిరిగుట్ట‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో కార్తీక మాస ఉత్స‌వాలు ఘనంగా కొన‌సాగుతున్నాయి. ఆదివారం సెల‌వు కావ‌డంతో భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.

S

Telangana | Published On Nov 22, 2026, 4.09 pm IST

Yadagirigutta | యాదగిరిగుట్ట‌లో ఘ‌నంగా కార్తీక‌ మాస ఉత్స‌వాలు
Advertisement

Yadagirigutta | త్రినేత్ర న్యూస్ : యాద‌గిరిగుట్ట‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో కార్తీక మాస ఉత్స‌వాలు ఘనంగా కొన‌సాగుతున్నాయి. ఆదివారం సెల‌వు కావ‌డంతో భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భ‌క్తులు స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తాలు నిర్వ‌హించారు. ఇక ఉచిత ద‌ర్శ‌నానికి 3 గంట‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నానికి 2 గంట‌ల‌ స‌మ‌యం ప‌డుతోంది. ఆలయ సమీపంలో కార్లు, ఇతర వాహనాలు బారులు తీరాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు.

Advertisement
Advertisement