Yadagirigutta | యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. 11 రోజుల పాటు ఇలా..
Yadagirigutta | తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10 గంటలకు వైభవంగా ప్రారంభమయ్యాయి. విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం వంటి పూజలతో పురోహితులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
Yadagirigutta | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10 గంటలకు వైభవంగా ప్రారంభమయ్యాయి. విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం వంటి పూజలతో పురోహితులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఈవో భవాని శంకర్, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల వేళ నిత్య కల్యాణం రద్దు..
ఈనెల 28వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారు రద్దు చేశారు.
11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇలా..
- ఫిబ్రవరి 18న స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంత్రం మత్స్యగ్రహణం, అంకురార్పణ
- ఫిబ్రవరి 19న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం భేరి పూజ
- ఫిబ్రవరి 20న ఉదయం మత్సావతార అలంకారం, సాయంత్రం శేష వాహన సేవ వేదపారాయణములు. రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ
- ఫిబ్రవరి21న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
- ఫిబ్రవరి22న శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవ
- ఫిబ్రవరి23న ఉదయం గోవర్ధన గిరి ధారి, సాయంత్రం సింహ వాహన సేవ
- ఫిబ్రవరి 24న జగన్మోహినీ అలంకార సేవ, అశ్వ వాహనం పై రాత్రి ఎదుర్కోలు వేడుక
- ఫిబ్రవరి 25న రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం
- ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలకు దివ్వవిమాన రథోత్సవం
- ఫిబ్రవరి27న స్వామి వారి చక్రతీర్థ స్నానం
- ఫిబ్రవరి 28 న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



