త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాలి.. కానీ జీ13, జీ14 క్వాలిటీదే వాడుతున్నారు

Harish Rao | యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాల‌ని.. అలా చేయ‌కుండా జీ13, జీ14 కోల్ వాడుతున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు ఆరోపించారు.

S

Telangana | Published On Sep 22, 2026, 3.28 pm IST

Harish Rao | యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాలి.. కానీ జీ13, జీ14 క్వాలిటీదే వాడుతున్నారు
Advertisement
  • రాజస్థాన్‌కు కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?
  • బేసిన్ కాని బేసిన్‌కు చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తున్నారు
  • బేసిన్‌లోనే ఉన్న ప్రాజెక్టులకు రేవంత్ నీళ్లు తీసుకెళ్లడం లేదు
  • మీడియా చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హ‌రీశ్ రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: యాదాద్రికి జీ10, జీ11 క్వాలిటీ కోల్ కావాల‌ని.. అలా చేయ‌కుండా జీ13, జీ14 కోల్ వాడుతున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు ఆరోపించారు. కొత్త‌గూడెంలో 800 మెగావాట్లు, భ‌ద్ర‌ద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి ఆగింద‌న్నారు. ఈ ప‌రిస్థితుల్లో రాజ‌స్థాన్‌కు క‌రెంటు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. బేసిన్ కానీ బేసిన్‌కు చంద్ర‌బాబు నీళ్లు తీసుకెళ్తుంటే.. బేసిన్‌లోనే ఉన్న ప్రాజెక్టుల‌కు రేవంత్ నీళ్లు తేవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తేనే మంత్రులు క‌ర్ణాట‌క వెళ్తున్నార‌ని వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భవ‌న్‌లో ఆయ‌న మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా మాట్లాడారు.

విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం 4 వేల మెగావాట్లకు 400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. కేసీఆర్ విజన్‌తో దేశంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించారు. యాదాద్రి బొగ్గు వాడకంలో నాణ్యతా లోపం ఉంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే ఈరోజు బొగ్గు కొరత ఎందుకు ఏర్పడుతుంది? ఈ నిల్వలు ఎక్కడ అని ప్రశ్నించేందుకు నేను క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళితే పోలీసులు అడ్డుకున్నారు.

రాష్ట్ర విభజన సందర్భంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఎన్.టి.పి.సి ద్వారా ఇస్తామని చెప్పారు. మేం తొలి విడతగా ఎన్టీపీసీ 800 మెగావాట్ల కేంద్రాన్ని స్థాపించేలా చర్యలు తీసుకుని పవర్ తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అని ఎందుకు చెప్పింది.. ఖర్చు లేని పనికి ఎందుకు నో చెబుతోంది? మన దగ్గర తయార‌య్యే సింగరేణి ఉత్పత్తి విద్యుత్ వద్దు అని రాజస్థాన్ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకున్నారు. రాజస్థాన్ కు కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?

రేవంత్ చేత‌కానిత‌న‌మే అది..

రైతుల పంటలు ఎండబెట్టి ఉసురుబోసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తిలో 3 వ వంతు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. రైతులకు 7 నుంచి 8 గంటలు కరెంటు ఇవ్వడం లేదు. థర్మల్ పవర్ స్టేషన్ లో 45 రోజులు బొగ్గు నిల్వలు ఉండాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం నీళ్లు బేసిన్ కు సంబంధం లేని కుప్పంకు తీసుకువెళ్లారు. రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ఎల్ నినో మీద పెడుతున్నారు.

బీఆర్ఎస్ ఒత్తిడితోనే మంత్రులు వెళ్తున్నారు..

ఏపీ సీఎం శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్లు కృష్ణా నదీ జలాలు తీసుకువెళ్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సొంత జిల్లా పంటలను ఎండబెడుతున్నారు. ఏపీలో రైతుల కేరింతలు తెలంగాణలో రైతుల ఆక్రందనలు ఉన్నాయి. గులాబీ చొక్కాలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని పొంగులేటి అన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చాం. బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే మంత్రులు కర్ణాటక వెళ్తున్నారు అని హ‌రీశ్ రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement