Mancherial | గణేశ్ శోభాయాత్రలో మరో యువతితో భర్త డ్యాన్స్.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
Mancherial | మ మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట మండలం దొడ్డిగూడలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం (Ganesh Immersion) సందర్భంగా భర్త మరో మహిళతో కలిసి డ్యాన్స్ (Dance) చేశాడన్న మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్నది.
Mancherial | త్రినేత్ర న్యూస్: మ మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట మండలం దొడ్డిగూడలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం (Ganesh Immersion) సందర్భంగా భర్త మరో మహిళతో కలిసి డ్యాన్స్ (Dance) చేశాడన్న మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్నది. దిడ్డిగూడకు చెందిన రాయిసిడాం సంధ్య (23), జంగు భార్య భర్తలు. గణేశ్ నవరాత్రులు ముగియడంతో.. పక్కనే ఉన్న సోనాపూర్‌లో (Sonapur) వినాయక నిమజ్జనోత్సం జరిగింది. ఈ సందర్భంగా మద్యం మత్తులో ఉన్న జంగు.. మరో యువతితో కలిసి డ్యాన్స్ చేశాడు. అది చూసిన సంధ్య మనస్థాపానికి గురైంది.
ఉదయాన్నే గణేశ్ మండపాన్ని తీసేందుకు జంగు సోనాపూర్ వెళ్లాడు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సంధ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం (Suicide) చేసింది. గుర్తించిన స్థానికులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొసం ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ ఆమె మృతిచెందింది. సంధ్య సోదరుడి ఫిర్యాదులో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..
- ●వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!
- ●Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు
- ●Plane Crash | కుప్పకూలిన సైనిక విమానం.. సీనియర్ అధికారులు సహా 14 మంది దుర్మరణం
- ●Sawan Barwal | 44 ఏండ్లలో తొలిసారి.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మారథాన్ రన్నర్ సవాన్ బర్వాల్

iPhone 17 Pro | ఐఫోన్ 17 ప్రొ పై భారీ డిస్కౌంట్.. రూ.56,990కే..

వరంగల్ నుంచి బీజేపీ బిగ్ ప్లాన్.. మధుకర్, దశరథ్కు కీలక బాధ్యతలు!

Junior Civil Courts | రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు

Traffic Restrictions | హైదరాబాద్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు





