Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?
Srinivas Goud | మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను ఎంజీఎం వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని.. ఆయన దండయాత్రకు వెళ్లలేదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఫైరయ్యారు. ఆయన వెంట కార్యకర్తలు కూడా పెద్దగా లేరన్నారు.
- వినయ్ భాస్కర్ దండ యాత్రకు వెళ్లలే.. ఆయనెంబడి కార్యకర్తలు కూడా పెద్దగా లేరు
- మేం బుక్ రాసుకుంటున్నం
- అధికారంలోకొచ్చాక రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం
- రేపు మళ్లా జూరాలకు వెళ్తున్నం.. ఫైరింగ్ అయినా ఆగం
- రైతులకు నీళ్లివ్వకుంటే మిలిటరీ కూడా మమ్మల్ని ఆపలేదు
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
Srinivas Goud | త్రినేత్ర న్యూస్: మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను ఎంజీఎం వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమని.. ఆయన దండయాత్రకు వెళ్లలేదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఫైరయ్యారు. ఆయన వెంట కార్యకర్తలు కూడా పెద్దగా లేరన్నారు. వినయ్ భాస్కర్‌ను చంపేస్తారా? అని నిలదీశారు. తాము బుక్ తయారు చేసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చాక రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. రేపు జూరాలకు వెళ్తున్నామని ఫైరింగ్ అయాని ఆగమని తేల్చి చెప్పారు. రైతులకు నీళ్లివ్వకుంటే మిలటరీ కూడా తమను ఆపలేదని ఉద్ఘాటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు, కాంగ్రెస్ సర్కార్‌పై రుసరుసలాడారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేసిన దాస్యం వినయ్ భాస్కర్‌పై వరంగల్‌లో పోలీసులు దాడి చేశారు. ఎంజీఎంకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వినయ్ భాస్కర్ దండ యాత్రకు వెళ్లలేదు. ఎంజీఎం ఆస్పత్రిలో రెండో అంతస్థులో పెచ్చులూడి పడి రోగులు బాధపడుతున్న తీరును తెలుసుకోవడానికి వెళ్లారు. ఆయన వెంబడి కార్యకర్తలు కూడా పెద్దగా లేరు. శాంతియుతంగా వినయ్ భాస్కర్ వెళ్తుంటే పోలీసులు కావాలనే దాడి చేశారు. వినయ్ భాస్కర్ ను చంపేస్తారా? ఈ దాడి వెనక ఎవరున్నారో తెలియాలి. దాస్యం వినయ్ భాస్కర్ పై దాడి చేసిన పోలీసులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి.
మీరు ఇటుకతో కొడితే మేం రాయితో కొడుతం..
పోలీసులు అంటే మాకు గౌరవం. పోలీసులకు అన్యాయం జరిగిందని 14 ఎఫ్ గురించే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అతి ఉత్సాహంతో విర్రవీగే పోలీసులపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎవరినీ వదిలి పెట్టం. ఈ దాడి వెనుక ఉన్న రాజకీయ నాయకులనూ వదిలిపెట్టం. మీరు ఇటుకతో కొడితే మేం రాయితో కొడుతం. మేం బుక్ తయారు చేస్తున్నాం.
రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు. జూరాలలో 9 టీఎంసీల నీళ్లు ఉన్నా రైతులకు సాగు నీరు ఇవ్వడం లేదు. ఏపీలో వరద జలాల ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తున్నారు. కృష్ణా నదిలో నికర జలాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంకు తరలిస్తున్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.
ఆదిత్యనాథ్ దాస్ ద్రోహం చేస్తుండు..
జూరాల గేట్లు ఎత్తకపోతే రేపు మళ్లీ అక్కడికి పోతాం. ఫైరింగ్ అయినా వెనక్కి తగ్గం. ఆదిత్య నాథ్ దాస్ తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా ఉండి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోతే మిలిటరీ కూడా మమ్మల్ని ఆపలేదు అని శ్రీనివాస్‌గౌడ్ తేల్చి చెప్పారు.
పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసుల దాడి సరైనది కాదు. వరంగల్ ఏంజిఏం ఆసుపత్రిలో రోగులను చూడడానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీద పోలీసుల దాడికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే రేవంత్ పని అయ్యింది. వినయ్ భాస్కర్ ను అడ్డుకొని పోలీసులు పిడి గుద్దులు గుద్దడం, దాడి చేయడం ముమ్మాటికి పిరికి పంద చర్య. దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. కార్యకర్తలు దైర్యంగా ఉండాలి. పోలీసులు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల మీద, కేటీఆర్, హరీష్ రావు, నా మీద కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన దుర్మార్గమైన పరిపాలన. ప్రజల పక్షాన నిలబడే నాయకుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తిరు చాలా బాధాకరం. వినయ్ భాస్కర్ తొందరగా కోలుకోవాలి.
కొత్త సంస్కృతికి తెర లేపారు: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీద పోలీసుల దాడి గర్హనీయం. దాడి చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళితే దాడి చేస్తారా? కాంగ్రెస్ పాలనలో కొత్త సంస్కృతికి తెరలేపారు. ఈ ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
తాజావార్తలు
- ●TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..
- ●Visa-Free Countries For Indians 2026 | వీసా టెన్షన్ లేదు.. ప్యాకింగ్ చేసుకొని బయలుదేరడమే! భారత పాస్‌పోర్ట్‌తో 2026లో వీసా లేకుండా వెళ్లగల 7 దేశాలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే

TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..

Visa-Free Countries For Indians 2026 | వీసా టెన్షన్ లేదు.. ప్యాకింగ్ చేసుకొని బయలుదేరడమే! భారత పాస్‌పోర్ట్‌తో 2026లో వీసా లేకుండా వెళ్లగల 7 దేశాలు

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..





