Kothapalli Jayashankar | అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టండి.. చంద్రబాబుకు లేఖ
Kothapalli Jayashankar | అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల లేఖ రాశారు.
Kothapalli Jayashankar | త్రినేత్ర.న్యూస్ : అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల లేఖ రాశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంత వ్యక్తుల నూతన విగ్రహాలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని (ఏపీసీఆర్డీఏ) పరిధిలో జయశంకర్ సార్ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా చూడాలని మేధావులు, విద్యావంతులు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సిద్ధాంతకర్త, మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) పరిధిలో తగిన భూమిని కేటాయించాలని తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం కన్వీనర్ రోహిత్ వక్రాల కోరారు.
జయశంకర్ తన జీవితాంతం ప్రజల ఆకాంక్షల కోసం, ప్రాంతీయ సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడారు. తన రచనలు, ఉపన్యాసాల ద్వారా తెలంగాణ ఉద్యమానికి మేధోపరమైన శక్తిని అందించారు. శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాల్లో తెలంగాణ ఉద్యమం చేశారు. నేడు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు కూడా భాష, చరిత్రను పంచుకుంటూ అభివృద్ధి పథాల్లో పురోగమిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలు తమ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ఈ నేపథ్యంలో అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమనేది ప్రజాస్వామ్య పరిపక్వతను, ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పరిపాలనా పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మహానీయులు, మేధావుల కృషిని ఏపీ కూడా కొనియాడాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ విగ్రహాన్ని నెలకొల్పడంతో.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సామరస్యానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ఈ విషయంలో చొరవ తీసుకుని అమరావతిలో 10 అడుగుల ఎత్తున్న విగ్రహ ప్రతిష్టాపనకు స్థలాన్ని కేటాయించాల్సిందిగా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నామని రోహిత్ వక్రాల పేర్కొన్నారు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలి : డీజీపీ సీవీ ఆనంద్
- ●KTR | రహ్మత్ పాషాను అభినందించిన కేటీఆర్
- ●Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే - బ్లడీ రోమియోతో రొమాన్స్
- ●Dharmapuri Arvind | రేవంత్.. రూమ్లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు
- ●OnePlus | వన్ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
- ●Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు

YIPS | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలి : డీజీపీ సీవీ ఆనంద్

KTR | రహ్మత్ పాషాను అభినందించిన కేటీఆర్

Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే - బ్లడీ రోమియోతో రొమాన్స్

Dharmapuri Arvind | రేవంత్.. రూమ్లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు






