Bhagyashri Borse | పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే – బ్లడీ రోమియోతో రొమాన్స్
లెనిన్‌తో తొలి విజయాన్ని అందుకున్న భాగ్యశ్రీ బోర్సే తెలుగులో మరో లక్కీ ఛాన్స్ అందుకుంది. నాచురల్ స్టార్ నానితో జోడీకట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డే అనుకున్న పాత్రను భాగ్యశ్రీ సొంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On Aug 4, 2026, 5.35 pm IST
Bhagyashri Borse | లెనిన్ మూవీతో కెరీర్ తొలి విజయాన్ని అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా లెనిన్ నిలిచింది. ఈ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీలో భారతి పాత్రలో భాగ్యశ్రీ నటనకు సినీ ప్రముఖులతో పాటు ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారు.
లక్కీ ఛాన్స్
లెనిన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న భాగ్యశ్రీ తాజాగా తెలుగులో మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్యారడైజ్ తర్వాత హీరో నాని...బ్లడీ రోమియో పేరుతో ఓ స్టైలిష్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని చాలా రోజుల క్రితమే అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. జూలై నుంచే బ్లడీ రోమియో షూటింగ్ మొదలుకావాల్సింది. కానీ ప్యారడైజ్ డిలే కారణంగా ఆలస్యమైంది. అక్టోబర్‌లో బ్లడీ రోమియో షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్‌ను ఢిల్లీలో చిత్రీకరించబోతున్నారు. ఆ తర్వాత మిగిలిన టాకీ పార్ట్ చాలా వరకు లండన్‌లోనే తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
బ్లడీ రోమియోలో...
బ్లడీ రోమియోలో హీరోయిన్‌గా తొలుత పూజా హెగ్డేను (Pooja Hegde)తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. డేట్స్ సమస్యలతో బుట్టబొమ్మ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. లెనిన్‌లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన భాగ్యశ్రీ...బ్లడీ రోమియోలో మోడ్రన్ లుక్‌లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లకు పూర్తి భిన్నంగా కంప్లీట్ గ్లామరస్‌గా భాగ్యశ్రీ పాత్ర సాగుతుందని అంటున్నారు. ఆమెలోని కొత్త కోణాన్ని ఈ సినిమాతో డైరెక్టర్ సుజీత్ ప్రజెంట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే హీరోయిన్‌గా బ్లడీ రోమియోలో భాగ్యశ్రీ పేరును అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్...
బ్లడీ రోమియో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్






