BRS USA | పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం.. బీఆర్ఎస్ యూఎస్ఏ దిగ్భ్రాంతి
BRS USA | తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతిపట్ల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) యునైటెడ్ స్టేట్స్ (BRS USA) బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
BRS USA | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతిపట్ల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) యునైటెడ్ స్టేట్స్ (BRS USA) బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నిబద్ధత గల ఉద్యమకారుడు, కేసీఆర్ (KCR) ఆత్మీయ అనుచరుడు, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు ఇక లేరనే విషయం తెలిసిన వెంటనే అమెరికా వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాదకర సమయంలో టీఆర్ఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆధ్వర్యంలో అత్యవసరంగా ఆన్‌లైన్ జూమ్ సంతాప సభ నిర్వహించబడింది. అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి సుమారు 1,000 మందికి పైగా ఎన్నారై తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశంలో పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.
అట్లాంటా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, ఫిలడెల్ఫియా, సాన్ ఆంటోనియో, సాన్ డియాగో, కనెక్టికట్, బోస్టన్, కొలంబస్, డెలావేర్, వర్జీనియా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ (Telangana) ఉద్యమంలో అత్యంత క్లిష్టమైన రోజుల్లో పార్టీకి అండగా నిలిచిన నిజమైన ఉద్యమ యోధుడని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడుతూ, దాదాపు ఎనిమిది నుంచి పది సంవత్సరాల పాటు కేసీఆర్‌తో భుజం భుజం కలిపి పనిచేసిన ఉద్యమ సైనికుడిగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా, కోట్లాది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని నమ్మి తన జీవితాన్ని ఆ ఉద్యమానికి అంకితం చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని సభలో పలువురు గుర్తుచేసుకున్నారు.

పోరాటస్ఫూర్తి, వినయం, క్రమశిక్షణ, అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకత్వం, కార్యకర్తల పట్ల ఆయన చూపిన ఆప్యాయత ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయని వక్తలు పేర్కొన్నారు. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు.
`పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ ఉద్యమానికి (Telangana Movement) తీరని లోటు. ఆయన వ్యక్తిత్వం, సేవాభావం, ఉద్యమ నిబద్ధత రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి` అని నివాళులర్పించారు. అమెరికాలోని తెలంగాణ సమాజం తరఫున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే పరమపదించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈమేరకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొంకల (67892 35028) ఒక ప్రకటనలో వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●PM KISAN | ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరో ఐదేండ్లు పొడిగింపు..
- ●Horoscope | ఆగస్టు 1 రాశి ఫలాలు.. ఈ రాశివారు నష్టపోయే ప్రమాదం ఉంది!
- ●Malayalam OTT | ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ మలయాళం మూవీ - అల్లు అర్జున్ పుష్ప తో కంపేరిజన్స్
- ●Godavari Floods | గోదావరి వరద ఉద్ధృతిపై అప్రమత్తం.. కలెక్టర్కు మంత్రి పొంగులేటి ఆదేశాలు..
- ●CM Revanth Reddy | తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి రక్షణ : సీఎం రేవంత్రెడ్డి
- ●Raashii Khanna | ధర్మన్ షూటింగ్లో రాశీఖన్నాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్

PM KISAN | ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరో ఐదేండ్లు పొడిగింపు..

Horoscope | ఆగస్టు 1 రాశి ఫలాలు.. ఈ రాశివారు నష్టపోయే ప్రమాదం ఉంది!

Malayalam OTT | ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ మలయాళం మూవీ - అల్లు అర్జున్ పుష్ప తో కంపేరిజన్స్

Godavari Floods | గోదావరి వరద ఉద్ధృతిపై అప్రమత్తం.. కలెక్టర్కు మంత్రి పొంగులేటి ఆదేశాలు..






