త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinod Kumar | పిచ్చి పిచ్చి స‌వాళ్లెందుకు.. ఫ‌స్ట్ మేడిగ‌డ్డకు బ‌య‌ల్దేరండి

Vinod Kumar | ఎల్‌నినో ప్ర‌భావంపై కేంద్రం నిన్న అన్ని రాష్ట్రాల‌కు ఓ సందేశం పంపింద‌ని.. రిజ‌ర్వాయ‌ర్ల‌లోని నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని సూచించింద‌ని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం పేరు కూడా ఉందని చెప్పారు. ఈ కరువు పరిస్థితుల్లో తెలంగాణకు కాళేశ్వరమే దిక్కన్నారు.

S

Telangana | Published On Jul 3, 2026, 5.21 pm IST

Vinod Kumar | పిచ్చి పిచ్చి స‌వాళ్లెందుకు.. ఫ‌స్ట్ మేడిగ‌డ్డకు బ‌య‌ల్దేరండి
Advertisement
  • రిజ‌ర్వాయ‌ర్ల‌లోని నీళ్ల‌ను పొదుపుగా వాడుకోవాల‌ని నిన్న‌నే కేంద్రం సందేశాలు పంపింది
  • ఎల్‌నినో ఎఫెక్ట్‌ లిస్టులో తెలంగాణ కూడా ఉంది
  • ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి కాళేశ్వ‌ర‌మే పెద్ద దిక్కు
  • రేవంత్ మొద్దు నిద్ర లేవ‌కుంటే వ‌చ్చే వేస‌వి భ‌యంక‌ర‌మే
  • మీడియా స‌మావేశంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్  

Vinod Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: ఎల్‌నినో ప్ర‌భావంపై కేంద్రం నిన్న అన్ని రాష్ట్రాల‌కు ఓ సందేశం పంపింద‌ని.. రిజ‌ర్వాయ‌ర్ల‌లోని నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని సూచించింద‌ని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం పేరు కూడా ఉందని చెప్పారు. పిచ్చి పిచ్చి స‌వాళ్ల‌తోటి కాలయాప‌న చేయకుండా ముందు మేడిగ‌డ్డ‌కు వెళ్లి యుద్ధ ప్రాతిప‌దిక‌న పంపులు ఆన్ చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఈ కరువు పరిస్థితుల్లో తెలంగాణకు కాళేశ్వరమే దిక్కన్నారు. ప్ర‌భుత్వం ఇలాగే నిర్ల‌క్ష్యం చేస్తే వ‌చ్చే వేస‌విలో స్నానం చేద్దామ‌న్నా నీళ్లు దొర‌క‌వ‌ని హెచ్చ‌రించారు. ఈమేర‌కు ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. చిన్న రబ్బర్ డ్యామ్ కట్టినా, ఇసుక మేట వేసినా కన్నెపల్లి పంపులు ఆన్ చేయవచ్చని తెలిపారు.

ఈరోజు ఉదయం 15 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నయ్‌..

వర్షాలు తగ్గడం వల్ల 2027 వేసవి కాలం భయంకరంగా ఉంటుంది. ఎల్‌నినో విపత్కర పరిస్థితి సృష్టించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పట్టినట్టు లేదు. మంత్రులు ఎల్‌నినోపై దృష్టి పెట్ట‌కుండా సవాళ్లు విసురుతూ డ్రామాలు ఆడుతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆరు గంటలకోసారి నదీ ప్రవాహాల సమాచారం ఇస్తుంటుంది. కాళేశ్వరంలో భాగమైన లక్ష్మిబ్యారేజి వద్ద ఈరోజు ఉదయం 15 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాగజ్ నగర్ దగ్గర 45 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తోంది. అంటే రేపటికి 4 టీఎంసీల నీళ్లు లక్ష్మి బ్యారేజి వద్దకు చేరుతాయి. రేవంత్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయం ద్వారా ఆ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కిందకు వృథాగా వెళ్తున్నాయి అని మాజీ ఎంపీ తేట‌తెల్లం చేశారు.

స్నానానికి కూడా నీళ్లుండ‌వ్‌..

రేవంత్ రెడ్డి మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయమంటే మొద్దు నిద్ర పోతున్నారు. ఐదు నెలల్లో రిపేర్లు కావాల్సి ఉండగా రెండున్నరేళ్లు దాటినా మోక్షం కలుగ లేదు. మేడిగడ్డ దగ్గర మోటార్లు ఆన్ చేసి ఉంటె ఎల్‌ఎండీ సగం నిండేది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఇట్లనే ఉంటే వచ్చే వేసవి కాలంలో స్నానానికి నీళ్లు కూడా ఉండవు. చిన్న రబ్బర్ డ్యామ్ కట్టినా, ఇసుక మేట వేసినా కన్నెపల్లి పంపులు ఆన్ చేయవచ్చు. ఎన్డీఎస్ఏకు రాష్ట్రం మీద పెత్తనం చేసే అధికారం లేదు. మేడిగడ్డ రిపేర్లు చేస్తే ఎన్డీఎస్ఏ వద్దన్నదా? కేసీఆర్‌ను బద్నామ్ చేయాలనే మేడిగడ్డకు మరమ్మతులు చేయక రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మేడిగడ్డను అట్లనే వదిలేస్తే వరదల్లో కొట్టుకుపోతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. భూ కంపం వచ్చినా అది కొట్టుకుపోదు అని వినోద్‌కుమార్‌ తేల్చి చెప్పారు.

అస‌మ‌ర్థుడిగా మిగిలిపోత‌డు..

ఎల్‌నినో ప్రభావంతోనైనా రేవంత్ రెడ్డి మేల్కోవాలి. వెంటనే మేడిగడ్డ దగ్గర తాత్కాలిక అడ్డుకట్ట వేసి మోటార్లు ఆన్ చేయాలి. కేసీఆర్ మళ్లీ సీఎం అయి ఉంటే కేవలం మూడు నెలల్లో రిపేర్లు జరిగి నీళ్లు వచ్చేవి. అనిల్ కుమార్ చీఫ్ ఇంజినీర్ హోదాలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎలా వాడుకోవాలో చెబితే ఆయనను బాధ్య‌త‌ల నుంచి తప్పించారు. ప్రాణహిత దగ్గర నీళ్లున్నా వాడుకోని అసమర్దుడిగా రేవంత్ మిగిలిపోతాడు అని మాజీ ఎంపీ విమ‌ర్శించారు.

బండి సంజ‌య్‌.. త‌మ్మిడి హ‌ట్టి అనుమ‌తి ఏమైంది?

తమ్మిడి హట్టికి రెండు నెలల్లో అనుమతి తెస్తా అని బండి సంజయ్ అన్నాడు. ఏమైంది? అది సాధ్యం కాదని ఆనాడే చెప్పా. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని హడావిడి చేసిన రేవంత్ ఇపుడా అంశం ఎందుకు మాట్లాడటం లేదు? 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడి హట్టి సాధ్యం కాదు. ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచి ఏం లాభం? రాజకీయ స్వార్థాలు పక్కనబెట్టి మేడిగడ్డ నుంచి వీలైనంత తొందరగా నీళ్లు పంప్ చేస్తేనే తెలంగాణ ఎల్‌నినోను ఎదుర్కోగలదని ప్రభుత్వం గ్రహించాలి అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement