Samantha | వంద కోట్లకు చేరువలో సమంత సినిమా – టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్
సమంత మా ఇంటి బంగారం సరి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. వంద కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. మా ఇంటి బంగారం సినిమాతో సమంతకు యాభై కోట్లకుపైనే లాభాలు వచ్చినట్లు సమాచారం.
Entertainment | Published On Jul 3, 2026, 6.30 pm IST
Samantha | మా ఇంటి బంగారం మూవీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సమంత. ఈ క్రైమ్ కామెడీ మూవీ రిలీజై రెండు వారాలు దాటింది. అయినా రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. వంద కోట్ల క్లబ్‌కు చేరువలో ఉన్న మా ఇంటి బంగారం తాజాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. ఈ వీకెండ్‌లోనే మా ఇంటి బంగారం మూవీ వంద కోట్ల మైలురాయిని టచ్ చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో ఇప్పటివరకు ఏ ఫిమేల్ సెంట్రిక్ మూవీకి వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టలేదు. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ హీరోయిన్‌గా సమంత చరిత్రను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.
92 కోట్లు...
ఇప్పటివరకు మా ఇంటి బంగారం సినిమాకు 92 కోట్ల వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మహిళా ప్రధాన సినిమాల్లో మహానటి 85 కోట్లతో ఇన్నాళ్లు నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగింది. కీర్తి సురేష్ సినిమా రికార్డును సమంత దాటేసింది.
30 కోట్ల లాభాలు...
మా ఇంటి బంగారం మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. క్రైమ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత నిర్మించింది. మా ఇంటి బంగారంతో ఈ జంట జాక్‌పాట్ కొట్టేశారు. థియేట్రికల్ రన్‌లోనే దాదాపు 30 కోట్ల వరకు సమంత, రాజ్ నిడిమోరులకు లాభాలు వచ్చినట్లు సమాచారం. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమాతో సమంతకు యాభై కోట్లపైనే ప్రాఫిట్స్ రావచ్చునని అంచనా వేస్తున్నారు.
నక్సలైట్‌గా...
మా ఇంటి బంగారంలో నక్సలైట్‌గా, తన కుటుంబాన్ని కాపాడుకునే కోడలిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన పాత్రలో సమంత అద్భుత నటనను కనబరిచింది. ఈ సినిమాలో సమంతపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో గుల్షన్ దేవయ్య, దిగంత్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్స్‌లోనే తాను తల్లి కాబోతున్నట్లు సమంత ప్రకటించింది. మాతృత్వ బంధం కారణంగా ఏడాది పాటు సినిమాలకు సమంత గ్యాప్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malavika Mohanan | అప్పుడు రిజెక్ట్ – ఇప్పుడు రొమాన్స్ – మాస్ మహారాజా మల్టీస్టారర్‌లో రాజాసాబ్ హీరోయిన్
జులై 19, 2026

Nivetha Thomas | రెండేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ – లేడీ ఓరియెంటెడ్ మూవీలో నివేదా థామస్ – టైటిల్ ఇదే!
జులై 19, 2026

National Awards | నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే – బెస్ట్ యాక్టర్‌గా మమ్ముట్టి – ఉత్తమ నటిగా యామీ గౌతమ్
జులై 18, 2026
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం



