త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | నెత్తురు క‌ళ్ల జూసిన కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది

Kavitha | ఉద్య‌మకారుల నెత్తురును క‌ళ్ల జూసిన కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌మ‌ని అడిగితే ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా అని మండిప‌డ్డారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయాలని ఏ పోలీస్ మ్యానువల్‌లో ఉంద‌ని ప్ర‌శ్నించారు.

S

Hyderabad | Published On Jul 2, 2026, 6.52 pm IST

Kavitha | నెత్తురు క‌ళ్ల జూసిన కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది
Advertisement
  • ఉద్యమకారులతో పెట్టుకున్న బీఆర్ఎస్ బాగుప‌డ‌లే.. మీరూ బాగుపడరు
  • మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయాలని ఏ పోలీస్ మ్యానువల్‌లో ఉంది?
  • సీఎం, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలి
  • ఇచ్చిన హామీలు ఎలా నెర‌వేరుస్తారో స్ప‌ష్టంగా చెప్పాలి
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్‌

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: ఉద్య‌మకారుల నెత్తురును క‌ళ్ల జూసిన కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌మ‌ని అడిగితే ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా అని మండిప‌డ్డారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయాలని ఏ పోలీస్ మ్యానువల్‌లో ఉంద‌ని ప్ర‌శ్నించారు. దీనికి ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, మంత్రివర్గం, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొల్లారం పోలీస్‌స్టేష‌న్ నుంచి విడుద‌లైన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, మాట ముచ్చట ఉండదా? అని నిల‌దీశారు. త‌మ‌తో చర్చించకుండా అమానుషంగా వ్యవహరించార‌ని ఆవేద‌న చెందారు.

తమకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలంటూ ఉద్యమకారులంతా ఇవ్వాళ భూపోరాటం చేస్తే వారికి మద్దతుగా మేం ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు, 250 గజాల స్థలం, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా దాని గురించి పట్టించుకోవటం లేదు. ఇప్పటి వరకు స్థలం లేదు, అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నది లేదు. పైగా గుర్తింపు కార్డులు కూడా లేవు. కానీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఉద్యమకారుల నెత్తురు చిందేలా కొట్టారు. ఉద్యమకారులతో పెట్టుకున్న గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం బాగుపడలేదు. మీరు బాగుపడరు అని శాప‌నార్థాలు పెట్టారు.

ఎలా వ్య‌వ‌హ‌రించారో వీడియోలు చూడండి..

ఉద్యమకారులకు అండగా ఉండాలని ఇవ్వాళ మా పార్టీ ఆడబిడ్డలందరం భూపోరాటానికి వెళ్లాం. కానీ మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా పట్ల ఏ విధంగా వ్యవహరించారో వీడియోలు చూడండి. మేం ఏం అడిగామని అంత అన్యాయంగా వ్యవహరించారు. మమ్మల్ని ఈడ్చుకెళ్తే పోలీసులకు ఏమైనా అవార్డులు ఇస్తారా? మేం మాట్లాడుకోని సహకరిస్తామని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా? మాట ముచ్చట ఉండదా? మాతో చర్చించకుండా అమానుషంగా వ్యవహరించారు అని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎందుకు మాటిచ్చారు?

మాట ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి కదా? ఇచ్చిన మాట అమలు చేసే ధైర్యం లేకపోతే ఎందుకు మాటిచ్చారు? ఉద్యమకారులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతుందో స్పష్టత ఇవ్వాలి. కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా సెక్రటేరియేట్ ముట్టడి చేశారు. వాళ్లకు కూడా ఏం న్యాయం చేస్తారో చెప్పాలి అని టీఆర్ఎస్ చీఫ్ డిమాండ్ చేశారు.

ఈ దాష్టీకానికి కాంగ్రెస్‌ మూల్యం చెల్లించుకుంటుంది..

మూసీ, మెట్రో అంటూ పెద్ద పెద్ద మాటలు కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి. ఉద్యమకారులను లాఠీలతో కొడితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఖండించటం లేదు. ఉందుకు ప్రశ్నించటం లేదు? ఉద్యమకారులకు టీఆర్ఎస్ మద్దతుగా వెళ్తే వాళ్లు ఉద్యమకారులు కాకుండా పోతారా? ఉద్యమకారుల పక్షాన మొదటి పోరాటాన్ని ప్రారంభించాం. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దాష్టీకానికి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది అని క‌ల్వ‌కుంట్ల క‌విత హెచ్చ‌రించారు.

 

Advertisement
Advertisement