Thalapathy Vijay | దళపతి విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్ – తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్
జూలై నెలాఖరున కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దళపతి విజయ్, అతడి కొడుకు జాసన్ సంజయ్ పోటీపడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాసన్ సంజయ్ డైరెక్షనల్ డెబ్యూ మూవీ సిగ్మా జూలై 31న థియేటర్లలోకి రాబోతుంది. అదే డేట్‌కు జనానాయగన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jul 3, 2026, 5.35 pm IST
Thalapathy Vijay | తమిళనాడు సీఎం దళపతి విజయ్‌తో బాక్సాఫీస్ వద్ద అతడి కొడుకు జాసన్ సంజయ్ పోటీపడబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జననాయగన్ సెన్సార్ అడ్డంకుల దాదాపు తొలగిపోయినట్లు సమాచారం. జూలైలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. జూలై 24 లేదా 31లను ఆప్షన్స్‌గా అనుకుంటున్నారట. త్వరలోనే ఈ రెండింటిలో ఓ డేట్‌ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
దర్శకుడిగా ఎంట్రీ...
కాగా దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సిగ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతోన్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలోకి రాబోతుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు.
తండ్రీ వర్సెస్ కొడుకు...
సడెన్‌గా జూలై నెలాఖరు రేసులోకి జననాయగన్ రావడం ఆసక్తికరంగా మారింది. తండ్రీ కొడుకుల బాక్సాఫీస్ పోరులో ఎవరూ విన్నర్‌గా నిలుస్తారన్నది అభిమానుల్లో ఉత్కంఠను పంచుతోంది. జూలై 31నే జననాయగన్ వస్తే సిగ్మా రిలీజ్ ఉంటుందా? అన్నది అనుమానమే. అదే డేట్ గనక మేకర్స్ ఫైనల్ చేస్తే కొడుకు సినిమాకు కావాలనే విజయ్ పోటీగా వస్తున్నాడంటూ విమర్శలు రావచ్చు. జూలై 24న వచ్చినా కూడా ఆ ఇంపాక్ట్ సిగ్మాపై గట్టిగానే పడొచ్చు. తండ్రి ప్రభంజనాన్ని తట్టుకొని జాసన్ సంజయ్ సినిమా ఎంత వరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందన్నది చూడాల్సిందేనని అంటున్నారు.
అన్‌ఫాలో...
కాగా విడాకుల వ్యవహారం కారణంగా తండ్రికి దూరంగా ఉంటున్నారు జాసన్ సంజయ్. సోషల్ మీడియాలో దళపతి విజయ్‌ని అన్‌ఫాలో చేశాడు. ఇద్దరి మధ్య ప్రస్తుతం సరైన సంబంధాలు లేవు.
యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సిగ్మా మూవీని తెరకెక్కిస్తోన్నాడు జాసన్ సంజయ్. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కేథరిన్ స్పెషల్ సాంగ్ చేసింది.
భగవంత్ కేసరి రీమేక్..
మరోవైపు జననాయగన్ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మమితా బైజు ఓ కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ హీరోగా నటించిన తెలుగు మూవీ భగవంత్ కేసరికి రీమేక్‌గా జననాయగన్ రూపొందుతోంది. జననాయగన్, సిగ్మా రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించాడు. జననాయగన్ తన చివరి సినిమా అని దళపతి విజయ్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ ఆరోపణలపై ధ్రువ్ విక్రమ్ క్లారిటీ – విమర్శలు ఏం చేయలేవంటూ కామెంట్స్
ఆగస్టు 18, 2026

Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ – వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాతో పోటీ!
ఆగస్టు 18, 2026

Jana Nayagan OTT | అఫీషియల్ – ఓటీటీలోకి సీఎం విజయ్ చివరి మూవీ – తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశే!
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Kalwakuntla Kavitha | సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..
- ●Mallikarjun Kharge | నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్న పిల్లాడు.. మీరా మాకు దేశభక్తి పాఠాలు చెప్పేది..? ఖర్గే
- ●Vinod Kumar | అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్
- ●Peddi Sudarshan Reddy | కూల్చిన చోటే పెద్ది విగ్రహాన్ని పెట్టాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్
- ●Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్

Kalwakuntla Kavitha | సామాజిక అన్యాయం అనాల్సిన రేవంతు.. సామాజిక న్యాయం అంటుండు

YouTube | యూట్యూబ్‌లో భారీ అప్డేట్.. ఇక తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు..

Mallikarjun Kharge | నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్న పిల్లాడు.. మీరా మాకు దేశభక్తి పాఠాలు చెప్పేది..? ఖర్గే

Vinod Kumar | అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతి ఉందా..? : మాజీ ఎంపీ వినోద్



