Arunodaya Naganna | ‘అరుణోదయ నాగన్న’ ఇకలేరు.. ఆయన ‘రాగాలు’ ఎప్పటికీ ‘అమరమే’
Arunodaya Naganna | ప్రముఖ గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు అరుణోదయ నాగన్న( Arunodaya Naganna ) (65) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగన్న ఖమ్మం జిల్లాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Arunodaya Naganna | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు అరుణోదయ నాగన్న( Arunodaya Naganna ) (65) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగన్న ఖమ్మం జిల్లాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. నాగన్న మృతిపట్ల అరుణోదయ కళాకారులు, పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నాగన్న మృతి విప్లవ లోకానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాది క్రితం బ్రెయిన్ స్ట్రోక్..
నాగన్న గతేడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రజల హృదయాల్లో అరుణోదయ నాగన్నగానే
ఖమ్మం జిల్లా రాజారం గ్రామానికి చెందిన నాగన్న తన పాటలతో విప్లవ భావాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎన్నో ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు ఆయన పాటలు ఊపిరి పోశాయి. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ ఆయన.. 'అరుణోదయ నాగన్న'గానే ప్రజా హృదయాల్లో నిలిచిపోయారు. సారా వ్యతిరేక ఉద్యమం, భూపోరాటాలు, గిరిజన హక్కుల ఉద్యమాల వంటి ఎన్నో ప్రజా పోరాటాలకు నాగన్న గొంతుక ఊపిరి పోసింది. సామాజిక మార్పు కోసం నిరంతరం శ్రమించిన ఆయనకు 2024 అక్టోబర్ నెలలో 'సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారం' కూడా లభించింది.
నాగన్న పలికించిన రాగాలు ఎప్పటికీ అమరమే : ఎమ్మెల్సీ దేశపతి
'అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అగ్రనేత, ప్రముఖ విప్లవ గాయకులు అరుణోదయ నాగన్న మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక తోటి కళాకారుడిగా ఆయన నిష్క్రమణ నా హృదయాన్ని గాయపరిచింది. ఖమ్మం జిల్లా రాజారం గ్రామానికి చెందిన నాగన్న, ఇంటి పేరు ఊరి పేరు లేకుండా కేవలం ప్రజా హృదయాలనే తన చిరునామాగా మార్చుకున్న నిఖార్సైన ప్రజా గాయకుడు. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా పీడిత ప్రజల పక్షాన నిలిచి, తన ఆటపాటలతో విప్లవ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సారా వ్యతిరేక ఉద్యమం, భూపోరాటాలు, గిరిజన హక్కుల పోరాటాల్లో ఆయన గొంతుక ఒక ఊపిరిగా నిలిచింది. సామాజిక మార్పు కోసం నిరంతరం శ్రమించిన ఆయన ప్రజాసేవకు గుర్తింపుగా ఇటీవల ‘సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారం’ కూడా లభించింది. గత ఏడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనా, పోరాట యోధుడిలా కోలుకుంటూ వచ్చిన నాగన్న, ఇటీవల ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో నేడు అనంత తీరాలకు వెళ్లిపోయారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన పాడిన పాటలు, పలికించిన రాగాలు ఎప్పటికీ అమరమే. నాగన్న మృతి విప్లవ, సాంస్కృతిక రంగాలకు తీరని లోటు'.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల
- ●Meera Nandan | జై బోలో తెలంగాణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●National Awards | తెలుగు వర్సెస్ మలయాళం - నేషనల్ అవార్డులపై ఫ్యాన్స్ వార్ - షాకిచ్చిన సీబీఎఫ్సీ
- ●Bhatti Vikramarka | సింగరేణి కుంభకోణంపై భట్టి రెస్పాండవడం సంతోషమే.. కానీ ఏదేదో మాట్లాడిండు
- ●KTR | 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

Thummala Nageswara Rao | రైతు భరోసా నిధుల విడుదలలో రేవంత్ ప్రభుత్వం రికార్డు : మంత్రి తుమ్మల

Meera Nandan | జై బోలో తెలంగాణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

National Awards | తెలుగు వర్సెస్ మలయాళం - నేషనల్ అవార్డులపై ఫ్యాన్స్ వార్ - షాకిచ్చిన సీబీఎఫ్సీ




