Bandi Sanjay | కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది ‘బిగ్ బాస్’ డ్రామా : కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay | రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి బిగ్ బాస్ డ్రామాను తలపించేలా నాటకాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. నాటకాలు ఆపకపోతే.. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమేషన్ అవుతారు.. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసి బిగ్ బాస్ డ్రామాను తలపించేలా నాటకాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. నాటకాలు ఆపకపోతే.. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమేషన్ అవుతారు.. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల వ్యవహార శైలిపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆడుతున్న నాటకాలను చూసి బిగ్ షోను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమరిపించే విధంగా వీళ్లు నటిస్తలేరు.. ఈ రెండు పార్టీల నాయకులు జీవిస్తున్నారు. మీ డ్రామాలు, నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు అని బండి సంజయ్ పేర్కొన్నారు.
బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమేషన్
మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తది. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అనుమతితో మేమే వేదికను ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఇద్దరు నాయకుల చొప్పున రండి. మేం ఏర్పాటు చేసే వేదికగా ఒకరి గురించి ఒకరు చెప్పుకొండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ఎవరు ఏం చేశారనే వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే మీకు నిజాయితీ, నిబద్దత ఉంటే మేం ఏర్పాటు చేసే వేదికకు రావాలని కోరుతున్నాం. మీరు ఇలానే ప్రవర్తిస్తే.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమేషన్ అవుతారు. తర్వాత వచ్చేది తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్. దాన్ని గుర్తుంచుకోండి.. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల్లో, పేపర్లలో కవరేజీల కోసం మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ రెండు అవినీతి పార్టీలే ప్రజలు చీదరించుకుంటున్నారు, ఛీత్కరించుకుంటున్నారు అని బండి సంజయ్ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Telangana | ఎల్ నినో ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
- ●Satyavathi Rathod | ప్రభుత్వ పథకం ఏదొచ్చినా ఆడవారి పేరు మీదే ఇచ్చారు
- ●Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?
- ●DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్
- ●Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ - రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
- ●MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి

Telangana | ఎల్ నినో ఎఫెక్ట్.. ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

Satyavathi Rathod | ప్రభుత్వ పథకం ఏదొచ్చినా ఆడవారి పేరు మీదే ఇచ్చారు

Pallavotsavam | ఈ నెల 22న తిరుమలలో పల్లవోత్సవం.. విశిష్టత ఏంటో తెలుసా..?

DMK Women Reservation bill | డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం వద్దు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రానికి డీఎంకే కండిషన్స్




