త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | కేసీఆర్ గారూ మేం ఎద‌గ‌డం ఇష్టం లేదా..? మంత్రి పొన్నం వేడుకోలు

Ponnam Prabhakar | ద‌ళిత మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ను ల‌క్ష్యం చేసుకోవ‌డం మంచిది కాద‌ని, ఆయ‌న ఏ విధంగా క‌ష్ట‌ప‌డి మంత్రి స్థాయికి వ‌చ్చాడో మీకు తెలియ‌నిది కాదు.. ఇది దృష్టిలో ఉంచుకుని కేటీఆర్, హ‌రీశ్‌రావు, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ను అదుపులో పెట్టుకోవాల‌ని కేసీఆర్‌ను కోరుతున్నాన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Jul 2, 2026, 6.50 pm IST

Ponnam Prabhakar | కేసీఆర్ గారూ మేం ఎద‌గ‌డం ఇష్టం లేదా..? మంత్రి పొన్నం వేడుకోలు
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : ద‌ళిత మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ను ల‌క్ష్యం చేసుకోవ‌డం మంచిది కాద‌ని, ఆయ‌న ఏ విధంగా క‌ష్ట‌ప‌డి మంత్రి స్థాయికి వ‌చ్చాడో మీకు తెలియ‌నిది కాదు.. ఇది దృష్టిలో ఉంచుకుని కేటీఆర్, హ‌రీశ్‌రావు, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ను అదుపులో పెట్టుకోవాల‌ని కేసీఆర్‌ను కోరుతున్నాన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. అయితే మంత్రి పొన్నం వ్యాఖ్య‌ల‌కు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు కూడా కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశిస్తే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ను జ‌డ్పీ చైర్మ‌న్ చేసింది నేనే అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఏమ‌న్నారంటే..?

గ‌న్‌పార్కు వ‌ద్ద గురువారం మంత్రులు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, అజారుద్దీన్‌తో క‌లిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. 'టెండ‌ర్ల‌న్నీ పార‌ద‌ర్శ‌కంగా ఉన్నాయి. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, హ‌రీశ్‌రావు, కేటీఆర్ మాట్లాడుతుంటే.. పెద్దాయ‌న చంద్ర‌శేఖ‌ర్ రావును కోరుతున్నాను. ఒక్క‌సారి వీళ్ల‌ను అదుపులో పెట్టుకోండి లేదంటే మీకు చెడ్డ పేరు వ‌స్త‌ది. మంత్రుల‌ను ఉద్దేశించి మీరు రావాలే మీరు రావాలే అంటున్న‌రు వీళ్లు. ఇటువంటి ద‌గుల్బాజీ మాట‌లు మాట్లాడుతున్నారు ఇవాళ‌. మీకు కూడా తెలుసుకదా.. ఏ విధంగా రాజ‌కీయంగా ఎదిగామో. మీరు గ‌తంలో మా ద‌గ్గ‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు క‌దా..? ల‌క్ష్మ‌ణ్ కుమార్ ఏ విధంగా క‌ష్ట‌ప‌డి వ‌చ్చిండో.. వాళ్ల నాన్న నాగ‌య్య సింగ‌రేణి కార్మికుడిగా క‌ష్ట‌ప‌డితే ఇవాళ అడ్లూరి రాష్ట్ర మంత్రి అయ్యిండు. ఎందుకు బ‌ట్ట‌కాల్చి మా మీద పారేస్త‌రు. మేం రాజ‌కీయంగా ఎద‌గ‌డం మీకు ఇష్టం లేదా మా జిల్లా సంస్కృతిలో భాగంగా. ఏం ఇబ్బంది పెడుతున్నాం. మ‌ళ్లీ చెబుతున్నాం.. మేం అవినీతి చేసిన‌ట్టు నిరూపిస్తే నీ ద‌గ్గ‌ర ఏ ఆధార‌మున్న నిన్న లక్ష్మ‌ణ్ కుమార్ చెప్పిన‌ట్టుగా, ఇత‌ర సంద‌ర్భాల్లో చెప్పిన‌ట్టు మేం ఇక్క‌డ్నే ముక్కు నేల‌కు రాసి రాజీనామాలు ఇస్తాం.. లేక‌పోతే మీరు ఏం చేస్తారో చెప్పండి. చాలెంజ్ వేస్తున్నాం.. ఊరికే ఎవ‌డు ప‌డితే వాడు మాట్లాడితే, కోన్ కిస్ కా గాడు మాట్లాడితే జ‌వాబు చెప్పం. వ‌స్తే శాస‌న‌స‌భ‌కు రండి.. ప్రెస్‌క్ల‌బ్‌కు రండి.. మాజీ మంత్రులైన ప్ర‌స్తుత‌ ఎమ్మెల్యేలుగా కొన‌సాగుతున్న వారు రండి.. టైం చెప్పండి.. మేం కూడా బ‌రాబ‌ర్ వ‌స్తాం.. ఆధారాలుంటే పాత్రికేయుల‌కు ఇవ్వండి.. ద‌గుల్బాజీ మాట‌లు మాట్లాడే వారి కోసం ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. ప్ర‌జా పాల‌న ప్ర‌భుత్వంలో పేద‌ల‌కు న్యాయం జ‌రిగేందుకు పార‌ద‌ర్శ‌కంగా పాల‌న అందిస్తున్నామని' మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

హ‌రీశ్‌రావు ఏమ‌న్నారంటే..?

తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. 'అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ అంటే మాకు చాలా గౌర‌వం.. మొద‌టిసారిగా ఆయ‌న జ‌డ్పీ చైర్మ‌న్ అయినప్పుడు నేనే ఇంచార్జిగా ఉండి ల‌క్ష్మ‌ణ్‌ను జ‌డ్పీ చైర్మ‌న్ చేయ‌డానికి బీఆర్ఎస్ పార్టీ స‌పోర్ట్ చేస్తే, కేసీఆర్ ఆదేశిస్తే నేను ద‌గ్గ‌రుండి ఆయ‌న‌ను జ‌డ్పీ చైర్మ‌న్‌ను చేశాను. చేసినా అంటే పార్టీ బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాను. ల‌క్ష్మ‌ణ్ కుమార్ నిజంగా ద‌ళిత‌బిడ్డ‌గా ద‌ళితుల‌కు న్యాయం చేయాల్సి ఉండే. మ‌ఫ‌త్‌లాల్ కంపెనీకి, గుజరాత్‌కు ఆర్డ‌ర్లు ఇవ్వొద్దు.. ద‌ళిత బిడ్డ‌లం మేం బ‌తుకుతాం.. ఆర్డ‌ర్లు గ‌తంలో మాకే ఇచ్చారు బాగా చేశామ‌ని అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌కు ద‌ళితులు లేఖ రాశారు. అయినా ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబుకు కూడా లేఖ రాశారు. ఈ ఆర్డ‌ర్లు గ‌త 10 ఏండ్ల నుంచి మేమే చేస్తున్నామ‌ని మాకే ఇప్పించండ‌ని ప‌రిశ్ర‌మ‌ల మంత్రిని కూడా ద‌ళిత బిడ్డ‌లు వేడుకున్నారు. పీఎంయూ చైర్మ‌న్‌కు కూడా మంత్రుల కంటే ముందు కూడా లేఖ రాశారు. ఇది మా స్వ‌యం ఉపాధి.. ద‌ళిత బిడ్డ‌ల నోరు కొట్ట‌కండి అని వేడుకున్నారు. సీఎస్‌కు కూడా లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ జీవోను ఉల్లంఘిస్తున్నారు.. టెండ‌ర్లుకు పోవొద్దు.. లిడ్ క్యాప్ ద్వారా ద‌ళిత బిడ్డ‌లుకు ఇవ్వాల‌ని ఈ జీవో ప్ర‌కారం టెండ‌ర్లు ఇవ్వ‌డం త‌ప్ప‌ని మా హ‌క్కులు కాపాడాల‌ని లేఖ రాశారు. ద‌ళిత మంత్రి, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి, సీఎస్, పీఎంయూ చైర్మ‌న్ ప‌ట్టించుకోలేదు. ద‌ళిత బిడ్డ‌ల రోద‌న అర‌ణ్య రోద‌న‌గా మారిపోయింది' అని హ‌రీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement