త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | డీలిమిటేషన్‌కు అనుకూలంగా ఓటు వేస్తం.. కానీ: కేటీఆర్‌

KTR | బీఆర్ఎస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చే డీలిమిటేష‌న్ బిల్లు (Delimitation Bill) కు తాము మ‌ద్దతు (Support) ఇస్తున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Nov 28, 2026, 3.12 pm IST

KTR | డీలిమిటేషన్‌కు అనుకూలంగా ఓటు వేస్తం.. కానీ: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: బీఆర్ఎస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చే డీలిమిటేష‌న్ బిల్లు(Delimitation Bill) కు తాము మ‌ద్దతు (Support) ఇస్తున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్ర‌క‌టించారు. త‌మ‌ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేయనున్న‌ట్లు పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కే అత్యంత ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటాను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్ల‌డించారు. ఈమేర‌కు ఆయ‌న శ‌నివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

మా వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉంది. దక్షిణ భారత రాష్ట్రాలకు పార్లమెంటులో ఉన్న ప్రాతినిధ్యం తగ్గొద్దు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగినా మేం సహించం. 24 శాతం ప్రాతినిధ్య వాటా యథాతథంగా ఉండాలి. ప్రతిపాదిత 50 శాతం సీట్ల పెంపుతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తి (Representation Ratio) మార‌ద‌నే హామీతోనే మ‌ద్ద‌తు ఇస్తున్నం. దీంతో తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ల (Women's Reservations)కు మేం ఎప్పుడూ మద్దతిస్తూనే ఉన్నాం. వాటిని అమలు చేయాలన్న మా నిబద్ధత ఇప్పటికీ కొనసాగుతుంది అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు.

Advertisement
Advertisement