Sabitha Indrareddy | బుల్లెట్ ట్రైన్ పేరిట సేకరించిన భూములు ఎవరి కోసం?
Sabitha Indrareddy | కాంగ్రెస్ వచ్చి రాగానే మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసిందని.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) కోసం సేకరించిన భూములు ఎవరి కోసమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
- నా నియోజకవర్గంలో అవసరం లేకున్నా 2,000 ఎకరాలు లాక్కున్నారు
- ప్రాజెక్టు ఎక్కడొస్తుందో తెల్వనప్పుడు బహదూర్ గూడ భూములను ఎందుకు లాక్కున్నరు
- భూ సేకరణ చేయమని చెప్పలేదని అశ్విని వైష్ణవ్ చెప్పారు
- హద్దులు పాతడంపై కిషన్‌రెడ్డి వివరణ ఇవ్వాలి
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్
Sabitha Indrareddy | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ వచ్చి రాగానే మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసిందని.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ (Bullet Train) కోసం సేకరించిన భూములు ఎవరి కోసమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భూ సేకరణ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదని అశ్విని వైష్ణవ్ చెప్పారన్నారు. చట్ట విరుద్ధంగా ఈ ప్రాజెక్టుకు హద్దులు పాతడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుల్లెట్ ప్రాజెక్టు ఎక్కడ వస్తుందో తెలియనప్పుడు బహదూర్ గూడ రైతుల భూములను పోలీసుల పహారాలో ఎందుకు లాక్కున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదన్నారు..
రాష్ట్రంలో ఎవరికి భరోసా ఇవ్వని పాలన నడుస్తోంది. రైతులను కేసీఆర్ అన్ని విధాలా ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు సాగు నీళ్లు, ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేమని చెప్పడం దౌర్భాగ్యం. మంత్రులు నేల విడిచి సాము చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రైతుల భూములు ప్రభుత్వ భూములని బలవంతం గా సేకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అలైన్‌మెంట్ ఖరారు కాలేదని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. భూ సేకరణ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదని అశ్విన్ వైష్ణవ్ చెప్పారు.
బుల్లెట్ ప్రాజెక్టు ఎక్కడ వస్తుందో తెలియనప్పుడు బహుదూర్ గూడ రైతుల భూములను పోలీసుల పహారాలో ఎందుకు లాకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు. బుల్లెట్ ప్రాజెక్టు కన్నా సీఎంకు సొంత ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో నలుమూలల బలవంతపు భూముల సేకరణ జరుగుతోంది. దేని కోసమో చెప్పకుండా భూ సేకరణ చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు.
నిన్న ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిండు..
నిన్న లగచర్లలో బలవంతపు భూ సేకరణకు నిరసనగా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వేల ఎకరాలు లాక్కొని రైతులను సీఎం రోడ్డున పడేస్తున్నారు. కొత్వాల్ గూడ నుంచి కొడంగల్ కు పెద్ద రోడ్డు వేస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ నుంచి మంచి రోడ్డు ఉంది. ఇంకో రోడ్డు దేని కోసం? సీఎం భూ దాహానికి హద్దే లేదా? నా నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ హై వే పేరిట రైతుల భూములను అవసరం లేకున్నా సేకరించారు. ప్రభుత్వ తీరుతో రైతులు భయభ్రాంతులకు లోనవుతన్నారు. నాదర్ గుల్ ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములంటూ అక్కడికి ఎవరిని వెళ్లనివ్వడం లేదు. వీటిపై కిషన్‌రెడ్డి వివరణ ఇవ్వాలి అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●PM Modi Bloomberg Forum | ఎవరి నష్టంతోనో మనం ఎదగడం లేదు.. ప్రపంచంతో పాటే భారత్ ప్రగతి
- ●IAS Vikas Marmat | పబ్‌లో ఏపీ ఐఏఎస్ వీరంగం.. బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదు
- ●Pushkar Singh Dhami | చొరబాటుదారులకు మద్దతిచ్చే మీరు..శివుడితో పోల్చుకుంటారా?
- ●Jupally Krishna Rao | మంత్రి క్వార్టర్లో బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు
- ●Iconic Cable Bridge | కృష్ణా నదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. త్వరలోనే శంకుస్థాపన
- ●Richa Parashar | సుప్రీం వద్ద కవరేజ్‌లో చేయి పట్టి లాగి నన్ను రాహుల్ గాంధీ తోసేశారు : గర్భిణి జర్నలిస్ట్ ఆరోపణలతో దుమారం

PM Modi Bloomberg Forum | ఎవరి నష్టంతోనో మనం ఎదగడం లేదు.. ప్రపంచంతో పాటే భారత్ ప్రగతి

IAS Vikas Marmat | పబ్‌లో ఏపీ ఐఏఎస్ వీరంగం.. బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదు

Pushkar Singh Dhami | చొరబాటుదారులకు మద్దతిచ్చే మీరు..శివుడితో పోల్చుకుంటారా?

Jupally Krishna Rao | మంత్రి క్వార్టర్లో బాత్రూమ్కు కోటి రూపాయలతో మరమ్మతులు





