త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి కొమ్ముకాస్తున్న సీఎం.. ఫీజుల నియంత్రణ చట్టం ఇంకెప్పుడు?: క‌విత‌

Kavitha | ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి సీఎం రేవంత్ (Revanth Reddy) కొమ్ముకాస్తున్నార‌ని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభ‌మై మూడు నెలలు గడుస్తున్నాయ‌ని, ఫీజుల నియంత్రణ చట్టం ఇంకెప్పుడు తెస్తారంటూ ముఖ్యమంత్రిని నిల‌దీశారు.

G

Telangana | Published On Sep 5, 2026, 10.26 am IST

Kavitha | ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి కొమ్ముకాస్తున్న సీఎం.. ఫీజుల నియంత్రణ చట్టం ఇంకెప్పుడు?: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి సీఎం రేవంత్ (Revanth Reddy) కొమ్ముకాస్తున్నార‌ని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభ‌మై మూడు నెలలు గడుస్తున్నాయ‌ని, ఫీజుల నియంత్రణ చట్టం ఇంకెప్పుడు తెస్తారంటూ ముఖ్యమంత్రిని నిల‌దీశారు. 2024 మే నెలలో స్కూల్ ఫీ రెగ్యులేటరీ కమిషన్ (School Fee Regulation Commission) ఏర్పాటు చేస్తున్నట్టు హామీ ఇచ్చార‌ని గుర్తుచేశారు. దానికి సంబంధించిన ముసాయిదా బిల్లు రెండేండ్లుగా కేబినెట్‌ను దాటి ఎందుకు ముందుకు రాలేదని ప్ర‌శ్నించారు.

ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు (School Fee) పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) సైతం భారీగా ఫీజులు పెంచినా కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని అడిగారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య వ్యాపారానికి ఎందుకు కొమ్ము కాస్తున్నారని, బడ్జెట్ స్కూళ్లను ఎందుకు దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్య‌మంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

1994లో జారీ చేసిన జీవో ఎంఎస్ 01 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో (Private Schools) ఆయా పాఠశాలల గవర్నింగ్ బాడీనే ఫీజుల ఫిక్స్ చేయాలని స్పష్టం చేశారు. 5 శాతానికి మించి ఫీజుల పెంపునకు అవకాశమే లేదని ఈ జీవో స్పష్టం చేస్తున్న‌ద‌ని చెప్పాయి. తెలంగాణలో ఆ జీవో ఎందుకు అమలు కావడం లేదని ప్ర‌శ్నించారు. రెండు రోజుల్లో ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Session) ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తూ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లును ఆమోదింపజేసి అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో బిల్లు అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తేవడంలో ప్రభుత్వం విఫలమైతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి టీఆర్ఎస్‌ ప్రజాపోరాటాలకు దిగుతుందని స్పష్టం చేస్తున్నాం.

Advertisement
Advertisement