త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ఆయన.. నిర్మాణ ప్రణాళికలు, డిజైన్లు, లేఅవుట్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

P

Telangana | Published On Sep 4, 2026, 6.06 pm IST

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement
  • మ‌ద్దూరులో రెసిడెన్షియ‌ల్ స్కూల్‌, డిగ్రీ కాలేజ్ ప‌నుల‌ను ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి

CM Revanth Reddy | నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ఆయన.. నిర్మాణ ప్రణాళికలు, డిజైన్లు, లేఅవుట్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మిస్తున్న స్థలాన్ని గతంలో ప్రజల అవసరాల కోసం కొందరు రైతులు సొంత డబ్బుతో కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూమిలో ప్రస్తుతం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగిన సీఎం.. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. భూములు ఇచ్చిన రైతులను గుర్తించి వారితో సీఎం మాట్లాడారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

గడువులోగా పూర్తి చేయాలి

మద్దూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. కళాశాల డిజైన్లు, లేఅవుట్‌ను పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికులను సీఎం పలకరిస్తూ.. వారితో కరచాలనం చేశారు.

Advertisement
Advertisement