త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamareddy | రెండు కార్ల మ‌ధ్య‌ ఇరుక్కుపోయిన స్కూట‌ర్‌.. 9వ త‌ర‌గ‌తి విద్యార్థి మృతి

Kamareddy | కామారెడ్డి (Kamareddy) ప‌ట్ట‌ణంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు కార్ల మ‌ధ్య‌ స్కూట‌ర్ ఇరుక్కుపోవ‌డంతో.. దానిపై వెళ్తున్న ఓ బాలుడు మృతిచెందాడు.

G

Telangana | Published On Sep 5, 2026, 10.07 am IST

Kamareddy | రెండు కార్ల మ‌ధ్య‌ ఇరుక్కుపోయిన స్కూట‌ర్‌.. 9వ త‌ర‌గ‌తి విద్యార్థి మృతి
Advertisement

Kamareddy | త్రినేత్ర‌.న్యూస్‌: కామారెడ్డి (Kamareddy) ప‌ట్ట‌ణంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు కార్ల మ‌ధ్య‌ స్కూట‌ర్ ఇరుక్కుపోవ‌డంతో.. దానిపై వెళ్తున్న ఓ బాలుడు మృతిచెందాడు.

ప‌ట్ట‌ణానికి చెందిన 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఇద్ద‌రు బారులు స్కూట‌ర్‌పై వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో రోడ్డుపై ఓ కారు యూట‌ర్న్ తీసుకుంటున్నది. స్కూటీ స్లోగా వెళ్తుండ‌గా, వారి వెన‌కాలే వేగంగా వ‌చ్చిన కారు స్కూట‌ర్‌తో స‌హా కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్ల మ‌ధ్య స్కూటీ న‌లిగిపోవ‌డంతో హేమంత్ అనే బాలుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. లోకేశ్ అనే మ‌రో బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స్థానికులు అత‌డిని హుటాహుటిన‌ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారును న‌డిపింది కూడా బాలుడేన‌ని గుర్తించారు. దీంతో కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement