Indiramma Sarees | ఎర్ర అంచు.. చిలుకపచ్చ రంగు.. దసరాలోపే ఇందిరమ్మ చీరలు పంపిణీ
Indiramma Sarees | రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ చీరలను (Indiramma Sarees) పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే సిద్ధమైన చీరలను జిల్లాలకు తరలిస్తున్నది.
Indiramma Sarees | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ చీరలను (Indiramma Sarees) పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే సిద్ధమైన చీరలను జిల్లాలకు తరలిస్తున్నది. స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులతోపాటు అర్హులైన మహిళలందరికీ దరసరా లోపే (Dasara Festival) ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. పూర్తి పారదర్శకతను పాటించేందుకు చీరలు అందుకునే ప్రతి మహిళ ఫొటో తీయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్‌లో చీరలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దరస లోపే చీరలన పంపిణీ పూర్తిచేయాలని నిర్ణయించింది. గతంలో పాలపిట్ట రంగులో చీరలను అందిచగా, ఈసారి సరికొత్త డిజైన్‌లో ఉన్న చిలకపచ్చ (Parrot Green) రంగులో మహిళలకు అందజేయనున్నారు.
ఈసారి చిలుకపచ్చ శోభ..
గతంలో ప్రభుత్వం మొదటి విడత కింద తెలంగాణ (Telangana) సంప్రదాయానికి ప్రతీకగా పాలపిట్ట రంగు చీరలను అందజేసింది. ఈ దఫా మహిళల అభిరుచులకు అనుగుణంగా ఎరుపు రంగు అంచుతో మెరిసిపోయే చిలుకపచ్చ రంగు చీరలను రూపొందించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు నాణ్యమైన, ఆధునిక డిజైన్లతో కూడిన చీరలను టెస్కో ద్వారా చేనేత కార్మికులతో తయారు చేయించారు.
తాజావార్తలు
- ●Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
- ●Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
- ●Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్
- ●చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!
- ●ఆ సింహాసనంపైనే అందరి కన్ను: తెలంగాణలో 'నయా సీఎం' లీగ్స్!
- ●Horoscope | సెప్టెంబర్ 5 రాశిఫలాలు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో పట్టుదల అవసరం!

Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్

చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!






