Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్
Bank of Baroda | త్రినేత్ర.న్యూస్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగార్ధులకు మరో గుడ్‌న్యూస్ చెప్పించింది. ఇప్పటికే 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO), 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1,100 SO ఉద్యోగాలను భర్తీ (BOB Recruitment) చేస్తున్నది. ఇందులో వెల్త్ ఎగ్జిక్యూటివ్ (Wealth Executive), క్రెడిట్ అనలిస్ట్ (Credit Analyst) వంటి పోస్టులు ఉన్నాయి. అర్హులైనవారు సెప్టెంబర్ 24 వరకు www.bankofbaroda.bank.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.93,960 వరకు వేతనం అందుతుంది.
మొత్తం పోస్టులు: 1,100
వెల్త్ ఎగ్జిక్యూటివ్- 1000 (జనరల్ 405, ఈడబ్ల్యూఎస్ 100, బీసీ 270, ఎస్సీ 150, ఎస్టీ 75)
క్రెడిట్ అనలిస్ట్- 100 (జనరల్ 40, ఈడబ్ల్యూఎస్ 10, బీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ 8)
అర్హతలు: వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై సంబంధిత రంగంలో కనీసం 2 ఏండ్లు పనిచేసి, 22 నుంచి 32 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు డిగ్రీ, సీఏ చేసి, ఏదైనా బ్యాంకులో ఏడాది పాటు పనిచేసి, 21 నుంచి 33 ఏండ్ల వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. రాతపరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది. 120 ప్రశ్నలు అండుగుతారు. 120 నిమిషాల్లు పూర్తి చేయాలి. సెక్షనల్ కటాఫ్, నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.175 + అదనపు చార్జీలు
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 24
వెబ్‌సైట్: www.bankofbaroda.bank.in
సంబంధిత వార్తలు

NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..
సెప్టెంబర్ 4, 2026

SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్
సెప్టెంబర్ 3, 2026

IBPS RRB | ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్.. గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!
- ●ఆ సింహాసనంపైనే అందరి కన్ను: తెలంగాణలో 'నయా సీఎం' లీగ్స్!
- ●Horoscope | సెప్టెంబర్ 5 రాశిఫలాలు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో పట్టుదల అవసరం!
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!

ఆ సింహాసనంపైనే అందరి కన్ను: తెలంగాణలో 'నయా సీఎం' లీగ్స్!

Horoscope | సెప్టెంబర్ 5 రాశిఫలాలు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో పట్టుదల అవసరం!

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు



