Both friends loved the same woman | ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు.. ఒకరి దారుణ హత్య
Both friends loved the same woman | ఇద్దరు స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఓ యువకుడు తన స్నేహితుడిని పదునైన ఆయుధంతో దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో పడేశాడు.
Both friends loved the same woman | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని రేవా (Rewa) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో పడేశాడు. ఈ దారుణ ఘటన చోరహటా పోలీస్ స్టేషన్ పరిధిలోని దువారీ గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిష్ కోల్, మహమ్మద్ ఇస్రార్ (30)లు మంచి స్నేహితులు. అయితే, ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇస్రార్‌పై కక్ష పెంచుకున్న ఆశిష్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇస్రార్‌ను దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో పడేశాడు. ఆగస్టు 26న ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రోజులుగా కుమారుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇస్రార్ కోసం అన్నిచోట్లా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆగస్టు 28న అతడి మృతదేహం ఒక డ్రైనేజీలో లభించింది. ఇస్రార్ శరీరంపై పలు గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో ఆశిష్ ఈ హత్య చేసినట్లు తేలింది. ప్రేమ వ్యవహారమే గొడవకు కారణంగా వెల్లడైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. క్షణికావేశంలో నిందితుడు తన స్నేహితుడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు.
అనంతరం మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడి మొబైల్ ఫోన్, కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలే నిందితుడిని పట్టించాయి. ఆశిష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
ఎర్ర అంచు.. చిలుకపచ్చ రంగు.. దసరాలోపే ఇందిరమ్మ చీరలు పంపిణీ
ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
సంబంధిత వార్తలు

Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన
ఆగస్టు 25, 2026

Baingan Bharta | వంకాయ కూర తిన్నాక.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు..
ఆగస్టు 23, 2026

Stray Dogs | వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
- ●Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
- ●Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్
- ●చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!
- ●ఆ సింహాసనంపైనే అందరి కన్ను: తెలంగాణలో 'నయా సీఎం' లీగ్స్!
- ●Horoscope | సెప్టెంబర్ 5 రాశిఫలాలు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో పట్టుదల అవసరం!

Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్

చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!



