త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Engineering students | కేర‌ళ‌లోని త్రిస్సూర్ (Thrissur) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 8 మంది దుర్మ‌ర‌ణం చెందారు.

G

National | Published On Sep 5, 2026, 7.35 am IST

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
Advertisement

Engineering students | త్రినేత్ర‌.న్యూస్‌: కేర‌ళ‌లోని త్రిస్సూర్ (Thrissur) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 8 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మృతులంతా ఇంజినీరింగ్ విద్యార్థులే (Engineering students) కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్ర‌మాదం శుక్రవారం రాత్రి 11.40 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగింది.

త‌మిళ‌నాడుకు (Tamil Nadu) చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు కారులో గురువాయూర్ (Guruvayur) వైపు నుంచి కొడుంగ‌ల్లూర్ దిశ‌గా వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కైప‌మంగ‌ళం స‌మీపంలోని ప‌నంబిక్కున్ను వ‌ద్ద హైవేపై నిలిపి ఉంచిన లారీని వారి కారు ఢీకొట్టింది. ప్ర‌మాదం ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక-రక్షణ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతిక‌ష్టంగా బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీ మార్చురీకి తరలించారు.

ప్రమాదానికి గురైన కారుకు తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు తమిళనాడు దిండిగల్‌లోని పీఎస్ఎన్ఏ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన‌ విద్యార్థులుగా నిర్ణ‌యించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

 

Advertisement
Advertisement