త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Aruna | కొండా సురేఖ‌ను త‌ప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ‌

DK Aruna | కొండా సురేఖ‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌డం తోటి మ‌హిళ‌గా చాలా బాధ క‌లిగించింద‌ని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి ఒక మ‌హిళ ఇంత‌దూర‌మొస్తే తొల‌గించ‌డం క‌రెక్టు కాద‌న్నారు.

S

Telangana | Published On Sep 4, 2026, 7.09 pm IST

DK Aruna | కొండా సురేఖ‌ను త‌ప్పిస్తే చాలా బాధేసింది: బీజేపీ ఎంపీ డీకే అరుణ‌
Advertisement

DK Aruna | త్రినేత్ర‌.న్యూస్: కొండా సురేఖ‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌డం తోటి మ‌హిళ‌గా చాలా బాధ క‌లిగించింద‌ని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి ఒక బీసీ మ‌హిళ ఇంత‌దూర‌మొస్తే తొల‌గించ‌డం క‌రెక్టు కాద‌న్నారు. త‌న కూతురు కొండా సుస్మిత ఏదో మాట్లాడింద‌ని సురేఖ‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం స‌మ‌ర్థ‌నీయం కాద‌న్నారు. బీసీలకు అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడే రేవంత్ రెడ్డి.. బీసీ మహిళ అయిన కొండా సురేఖను తొలగించడం స‌మంజ‌సం కాద‌న్నారు. ఈమేర‌కు ఆమె శుక్ర‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ పైవిధంగా రియాక్ట్ అయ్యారు.

కొండా సురేఖ ఒక సీనియ‌ర్ నాయ‌కురాలు, మ‌హిళా నాయ‌కురాలు. రాజ‌కీయాల్లో అనేక గ్రూపులుంటాయి, త‌గాదాలుంటాయి. కాంగ్రెస్ విభేదాల‌ను రోజూ ప‌త్రిక‌ల్లో చూస్తున్నం. ప్ర‌తొక్క‌రు ప్ర‌భుత్వం మీద మాట్లాడుతున్న తీరును కూడా చూస్తున్నం. కాంగ్రెస్‌లో ఉన్న‌ అంతర్గత విభేదాలే సురేఖ బర్తరఫ్‌కు దారితీశాయి.

2004లో నాతో పాటే సురేఖ ప‌ని చేసింది. అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నం. 2009లో మేమంతా రాజశేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో మంత్రులుగా ప‌ని చేసినం. ఈరోజు కూడా మంత్రి హోదాలో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సేవలందిస్తుంద‌ని అంద‌రం సంతోష‌ప‌డ్డం. కానీ ఈరోజు ఆమెను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం బాధ క‌లిగిస్తోంది. ఒక మ‌హిళ అని చూడ‌కుండా.. కాంగ్రెస్ నాయ‌కులు, సీఎం రేవంత్‌రెడ్డి చాలా మాట్లాడుతున్నారు. ఒక బీసీ మ‌హిళా త‌న కూతురు ఏదో మాట్లాడింద‌ని చెప్పేసి ఆమె మీద‌ ఇలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఏమాత్రం స‌మ‌ర్థ‌నీయం కాదు.

బీజేపీలో చేర‌డంపై..

రాజ‌కీయంగా క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చుకొని ఒక మ‌హిళ ఇంత‌దూరం రావ‌డ‌మ‌నేదే చానా గొప్ప విష‌యం. త‌ట్టుకుంటూ, నెట్టుకుంటూ ఇంత‌దూరం వ‌చ్చి రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవ‌డ‌మే ఒక‌ గొప్ప విష‌యం. ఇటువంటి సంద‌ర్భంలో ఆమెను మంత్రివ‌ర్గంలోంచి తీసేయ‌డ‌మ‌నేది క‌రెక్టు కాదు. ఆమెను బీజేపీలోకి ఆహ్వానించ‌డంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు అని డీకే అరుణ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement