Malla Reddy | 22A యాడికెళ్లొచ్చింది? ఎవల్దెచ్చిర్రు.. మీరు ఇమ్మిడియేట్లి దిగి బొంరాస్‌పేట రైతుల భూములు కాపాడాలే
Malla Reddy | 22A యాడికెళ్లొచ్చిందని.. ఎవల్దెచ్చిర్రని.. బొంరాస్‌పేట 1000 ఎకరాల ల్యాండును కాపాడే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డికి లేదా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశ్నించారు. '22A' పేరుతో కొత్త నిబంధనలు తెచ్చి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోటి ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు.
- 1000 ఎకరాల ల్యాండుది నీకు బాధ్యత కాదా?
- 50 ఎకరాల ITC భూములు ఎట్ల మాయమైనయ్
- ఈ నంబర్లన్ని శాతవడితోనే మారిపోతున్నయా?
- కింద ఏంజరుగుతుందో మీగ్గూడ తెల్సు
- రేవంత్‌పై తనదైన స్టయిల్‌లో సెటైర్లు గుప్పించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla Reddy | త్రినేత్ర.న్యూస్: 22A యాడికెళ్లొచ్చిందని.. ఎవల్దెచ్చిర్రని.. బొంరాస్‌పేట 1000 ఎకరాల ల్యాండును కాపాడే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డికి లేదా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశ్నించారు. ఐటీసీకి చెందిన 50 ఎకరాల భూములను కూడా కాంగ్రెస్ సర్కార్ మాయం చేసిందని ఆరోపించారు. పట్టాలు ఉన్నప్పటికీ.. '22A' పేరుతో కొత్త నిబంధనలు తెచ్చి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కోటి ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ప్రతి జాగల రైతులను ఎగ్గొట్టుడే..
కాంగ్రెస్ అంటేనే కబ్జా. కాంగ్రెస్ అచ్చిందంటేనే ఎక్కడ జూసినా దోపిడే. ఎక్కడ సూడు నువ్.. తెలంగాణ రాష్ట్రమంత గూడా. రైతులకు న్యాయం జేస్తమని గవర్నమెంటు వచ్చింది. కానీ అంతట అన్యాయమే. ప్రతి జాగల రైతులను ఎగ్గొట్టుడే. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్ల కోటి ఎకరాల చిల్లర. 22A తీసుకొచ్చిండ్రు. ఆ 22ఏ అంటే అర్థమేగాదు. మరి 22A అంటే సీఎంకు తెల్వదా? కలెక్టర్లకు తెల్వదా? రెవెన్యూ మంత్రికి తెల్వదా?
ఇదెందుకొచ్చింది 22A.. ఎన్నళ్లేంది? 75 ఏండ్ల నుంచి పట్టాలున్నయ్. వ్యవసాయం జేసుకుంటుర్రు. పాసుబుక్కులున్నయ్. ఆంధ్రప్రదేశ్ పాస్‌బుక్కులున్నయ్. కొత్తయొచ్చినయ్. భూ భారతి పాస్ బుక్కులొచ్చినయ్. కానీ ఈ 22A యాడికెళ్లొచ్చింది. ఎందుకొచ్చింది? ఎవల్దెచ్చిర్రు? ఈళ్లంతా నిద్రబోతుర్రా? ఏంజేస్తున్నట్లు గవర్నమెంటు. అంత కల్లోలం అయితుంది.
కనికరించిండ్రయా మన సీఎము..
వ్యాపారస్థులను, భూస్వాములను, రైతులను ఇట్లా ప్రతొక్కదాంట్ల 22A.. 22A.. 22A. మళ్ల పోవాలే ఎమ్మార్వో తానికెంచి ఆర్డీవో.. ఆర్డీవోతానికెంచి కలెక్టర్, కలెక్టర్ తాన్నుంచి మంత్రి. ప్రతిది ఫైరో చేసుకొని మళ్ల రౌండ్‌గా చక్రం తిప్పుతేగాని అది బయటికొస్తలేదు. నిన్న మాత్రం దయతలచి కనికరించిండ్రయా మన సీఎము. 22A ఉంటే అందర్ని కాపాడతా అని అన్నడు. సరే మంచి మాట చెప్పినవ్. మరి 22A ఎట్లొచ్చిందో నువ్ ఎంక్వయిరీ చేయవా? నీ బాధ్యత గాదా? నువ్ సీఎం గాదా మన రాష్ట్రానికి?
బొంరాస్‌పేట 1000 ఎకరాల ల్యాండుది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవలు జేస్తున్నరు ఇదంతా. శాతవడి చేస్తున్నరా? ఈ నంబర్లన్ని మారిపోతున్నయ్. ఇదంతా శాతవడితోనే అయితుందా? ఎవనికి తెలుస్తలేదా.. ఎట్లకెళ్లి మారుతున్నయ్ ఈ నంబర్లన్నీ? ఎవల్ పేరు మీదికెక్కుతున్నయ్? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. మరి శాతవడి మాయంజేసిర్రా? ఈ భూమి ఎవలి పేరు మీద వోయింది. ఎవరికెక్కుతున్నది? ఎందుకెక్కుతున్నది? 1975లో ఈనది పాస్ బుక్ ఉంది. అప్పడిసంది వ్యవసాయం జేసుకుంటుండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది గదా? ఆ టైంలనే పాస్‌బుక్ అయింది కదా? మరి ఇప్పుడెందుకు మారుతుంది? 50 ఏండ్ల కింద అమెరికా పోయి వచ్చినోనికి మీరు హెల్ప్ జేస్తారు?
ఇట్లనే మమ్ముల సంపుకతింటరా?
చిన్న చిన్న రైతులు ఎవుసాలు చేసుకొని బతుకుతుర్రు. ఈ పాస్‌బుక్కులకు వ్యాల్యూ లేదా? ధరణికి వ్యాల్యూ లేదా? భూ భారతికి వ్యాల్యూ లేదా? ప్రొసీడింగ్‌కు వ్యాల్యూ లేదా? ఇవన్ని ఇప్పుడు గోదారిల కలిపేసి ఎవన్కో వస్తే వానికి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎట్లయితది.. ఏమైతది? అసలు గవర్నమెంట్ ఉందా? లేదా? అన్ని ఎమ్మార్వోనే మార్చేస్తడా? ఏదనుకుంటే అదైతదా? ఇట్లనే మమ్ముల సంపుకతింటరా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా సీఎం? ఇదేనా లెక్క? ఎవ్వర్ లేరా? మమీరు ఎంక్వయిరీ ఎయ్యాలే.. ఈ రైతులను కాపాడాలే.. ఈ భూములను కాపాడాలే. ఎందుకంటే మీరు కాపాడ్తా అని చెప్తున్నరు.. మీరు మాట ఇస్తున్నరు. కానీ కింద ఏంజరుగుతుందో మీగ్గూడ తెల్సు. మీరు ఇమ్మిడియేట్లి దిగి బొమ్మరాసిపేట్ రైతులను కాపాడాలే.
సంబంధిత వార్తలు

MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు
ఆగస్టు 14, 2026

Rajagopal Reddy | నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేస్తున్నారు.. బయటివారి పెత్తనం ఎక్కువైంది
ఆగస్టు 14, 2026

Harish Rao | తెలంగాణ వ్యతిరేక అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి.. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్‌కు హాజరైతే చూస్తూ ఊరుకోం
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ రొమాన్స్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శనార్తి
- ●Stock Markets | వరుసగా రెండు వారాల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Motorola Moto G Max | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- ●George Krish | శర్వానంద్ జార్జ్ క్రిష్ షురూ - ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
- ●Supreme Court | ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..
- ●MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు

Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ రొమాన్స్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శనార్తి

Stock Markets | వరుసగా రెండు వారాల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

Motorola Moto G Max | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..

George Krish | శర్వానంద్ జార్జ్ క్రిష్ షురూ - ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పేశారుగా!



