Hyderabad | నగరంలో వర్షం.. ఉక్కపోతకు ఉపశమనం..
Hyderabad | భాగ్యనగరం భానుడి భగభగలతో మండిపోతున్న సంగతి తెలిసిందే. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతలతో నగర జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే విధంగా హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : భాగ్యనగరం భానుడి భగభగలతో మండిపోతున్న సంగతి తెలిసిందే. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతలతో నగర జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే విధంగా హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో నగర వాసులు చిరుజల్లులను ఎంజాయ్ చేస్తూ.. చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.
మలక్‌పేట, నాంపల్లి, అబిడ్స్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, చార్మినార్, అల్వాల్, కాప్రా, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 8 గంటల వరకు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు కూడా నగరంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం కలగనుందని తెలిపారు.
గత వారం రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదై.. నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 22 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా, మిగతా 11 జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




