KTR Birthday in Denmark, Australia, UK | కేటీఆర్‌కు శుభాకాంక్షల వరకే ఆగిపోం.. మొక్కలు నాటితేనే మాకు అసలైన ఆనందం
KTR Birthday in Denmark | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకల వేళ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం వరకే పరిమితం కాబోమని.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతామని తెలంగాణ ప్రవాసులు పేర్కొన్నారు. అప్పుడే తమకు అసలైన ఆనందమని తెలిపారు. డెన్మార్క్‌లో కేటీఆర్ జన్మదినాన్ని వారు ఘనంగా నిర్వహించి మొక్కలు నాటారు.
- డెన్మార్క్‌లో కేటీఆర్ 50వ జన్మదిన వేడుకల్లో తెలంగాణ ప్రవాసులు
KTR Birthday in Denmark | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకల వేళ ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం వరకే పరిమితం కాబోమని.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతామని తెలంగాణ ప్రవాసులు పేర్కొన్నారు. అప్పుడే తమకు అసలైన ఆనందమని తెలిపారు. డెన్మార్క్‌లో కేటీఆర్ జన్మదినాన్ని వారు ఘనంగా నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రవాసులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్యామ్ బాబు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణంపై అవగాహన కూడా పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక్కొక్కరు ఒక మొక్క నాటితే భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చు. మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉంటాం. అందుకోసం ప్రతిజ్ఞ కూడా చేశాం అని డెన్మార్క్‌లోని బీఆర్ఎస్ నాయకుడు శ్యామ్ బాబు ఆకుల తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి, పారిశ్రామిక రంగ విస్తరణకు, ఐటీ రంగ ప్రగతికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేటీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుస్థిరమైన పాలన కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ దేశవ్యాప్తంగా యువ నాయకులకు ఆదర్శంగా నిలిచారు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి గడ్డం, విశాల్ వెంకటశెట్టి, ఖాజా అక్తర్, రామ్‌రెడ్డి పబ్బటి, సుభాన్, వెంకట సుభాష్, వాసు, జగదీష్, చరణ్, మహిత, లక్ష్మి పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలో రక్తదానం..
ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ అనిల్ బైరెడ్డి నాయకత్వంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమంలో భాగంగా గురువారం మెల్‌బోర్న్‌లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాయకులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. అనంతరం కేక్ కోసి సంబరాలు చేసుకొన్నారు. రక్తదానం చేసిన వారికి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



ఈ కార్యక్రమంలో రమేష్ ముత్యాల, కార్తీక్, సత్య, గుండ సాయిరాం రెడ్డి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
యూకే లెస్టర్ పట్టణంలో రక్తదానం, లండన్‌లో సేవా కార్యక్రమాలు
యూకే వ్యాప్తంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజలకు సమర్థ నాయకత్వం అందిస్తూ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రజా సేవలో మరింత శక్తి, విజయాలను ప్రసాదించాలని కోరుకున్నారు. యూకేలోని ఎన్నారైల తరఫున కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్నారై బీఆర్ఎస్ యూకే లెస్టర్ పట్టణ ఇంచార్జ్ సాకేత్ రావు కాచవరపు ఆధ్వర్యంలో "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఉపాధ్యక్షుడు రవి రేతినేని తెలిపారు. మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారన్నారు.

లండన్‌లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారమని ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవపేట్ తెలిపారు. కేటీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతామని ఉపాధ్యక్షుడు సత్య చిలుముల తెలిపారు. యూకే వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సభ్యులందరికీ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రేటినేని, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శి - ఐటీ, మీడియా అండ్ పీఆర్ రవి ప్రదీప్ పులుసు, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, గణేష్ పాస్తం, కోశాధికారి సురేష్ బుడగం, సెక్రటరీ మల్లా రెడ్డి, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, కార్యదర్శి - యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల, మెంబర్షిప్ కో ఆర్డినేటర్, అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, నర్సింగ రావు, యూత్ వింగ్ కో ఆర్డినేటర్ అమరేశ్వరి బోయిని, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ రావు పేరాల, జనార్ధన్ దమ్మక్కపల్లి, హరికృష్ణ మామిళ్ల, అబ్దుల్ కుదుస్, లెస్టర్ ఇంచార్జ్ సాకేత్ కాచవరపు టాక్ సంస్థ సభ్యులు పవిత్ర రెడ్డి, సుప్రజ పులుసు, క్రాంతి రేటినేని పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు.. మార్కెట్లకు స్వల్ప ఊరట..
- ●IIT Bombay | విద్యార్థి ఆత్మహత్య కేసు.. ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన ఐఐటీ బాంబే
- ●Revanth Reddy | సీఎం గారు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూస్తా.. అనుమతివ్వాలంటూ నాని రిక్వెస్ట్.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
- ●College Student | ఢిల్లీలో మరో ఘటన.. కళాశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన ఆకతాయిలు
- ●CRPF | సీఆర్పీఎఫ్లో 521 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు..
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Stock Markets | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు.. మార్కెట్లకు స్వల్ప ఊరట..

IIT Bombay | విద్యార్థి ఆత్మహత్య కేసు.. ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన ఐఐటీ బాంబే

Revanth Reddy | సీఎం గారు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూస్తా.. అనుమతివ్వాలంటూ నాని రిక్వెస్ట్.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

College Student | ఢిల్లీలో మరో ఘటన.. కళాశాల విద్యార్థినిని వెంబడించి వేధించిన ఆకతాయిలు






