Harish Rao | మహేశ్‌కుమార్, అద్దంకికి శిక్ష పడేదాక వదలం
Harish Rao | క్షుద్ర పూజలంటూ తప్పుడు ప్రచారం చేసిన టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు శిక్ష పడేదాక వదలమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు.
- క్షుద్ర పూజలంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు
- ఎవరేమన్నా మాకు న్యాయస్థానాల మీద బలమైన నమ్మకముంది
- గోబెల్స్ ప్రచారం చేస్తే ఎంత దూరమైనా వెళ్తాం
- దానంపై వేటు రేవంత్‌కు గట్టి గుణపాఠం
- నాంపల్లి కోర్టు వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్: క్షుద్ర పూజలంటూ తప్పుడు ప్రచారం చేసిన టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు శిక్ష పడేదాక వదలమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. వారికి కోర్టు తగిన బుద్ధి చెబుతుందని బలంగా నమ్ముతున్నామన్నారు. పరువు నష్టం దావా కేసులో ఆధారాలతో సహా అన్నీ ఫైల్ చేశామని, కోర్టు పిటిషన్ స్వీకరించిందని తెలిపారు. ఎవరెన్ని అన్నా, ఎన్ని కేసులు పెట్టినా తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని వెల్లడించారు. గురువారం నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర కామెంట్స్ చేసినా తాము వాళ్లలా నోరు జారడం లేదన్నారు.
క్షుద్ర పూజలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు ఈడ్చుతాం. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. కోర్టు ద్వారా బుద్ధి చెబుతాం. మహేశ్ కుమార్, అద్దంకిపై లీగల్‌గా ముందుకు వెళ్తున్నాం. పరువు నష్టం దావా కేసు ఆధారాలతో సహా ఫైల్ చేసినం. కోర్టు వారు పిటిషన్ స్వీకరించారు. వచ్చే బుధవారం మళ్లీ పిలిచారు. స్టేట్మెంట్స్ రికార్డు చేస్తం అని చెప్పారు.
వాళ్లు బురదలో ఉన్నరు..
దేవుళ్ల దగ్గరకు వెళ్తే కూడా క్షుద్ర పూజలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవు. దిగజారుడు వ్యాఖ్యలు ఉండవు. వాళ్లు బురదలో ఉన్నరు.. మాకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నరు. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నరు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏమైనవి అని అడిగితే లేని పోని నిందలు చేస్తున్నరు. డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు.
డిప్యూటీ స్పీకర్ ఉండి ఉంటే..
శాసనసభలో కూడా అనేక అబద్దాలు మాట్లాడుతున్నారు. స్పీకర్ గారికి నోటీసులు కూడా ఇచ్చినం. మూడేళ్లు అయినా డిప్యూటీ స్పీకర్ ను కూడా అపాయింట్ చేయలేదు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ గారు ఉంటారు. వారు ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటారు. కానీ మూడేళ్లు అయినా అపాయింట్మెంట్ జరగలేదు. ఎన్నిసార్లు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోవడం లేదు. మూడేళ్ల నుంచి డైవర్షన్ డ్రామా తప్ప కాంగ్రెస్ పాలనలో చేసిందేం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. మాటలతో కాలం గడుపుతున్నారు.
రాష్ట్రం తిరోగమనం దిశలో పయనిస్తున్నది. నీళ్ల కష్టాలు, కరెంట్ కష్టాలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదు. ఎల్ నినో పేరు చెప్పి చేతులు ముడుచుకు కూర్చుంటున్నరు. ప్రతిపక్షంగా మేం ప్రభుత్వాన్ని నిలదీస్తే సహించలేకపోతున్నరు. క్షుద్రపూజలు అంటూ ఆరోపణలు చేసిన వారికి కోర్టు తగిన బుద్ధి చెబుతుందని, తగిన చర్యలు తీసుకుంటుందని బలంగా నమ్ముతున్నాను. గోబెల్స్ ప్రచారం చేస్తే వదిలిపెట్టం, ఎంతటి వారినైనా వదలం, ఎంత దూరం అయినా పోతాం. వారికి శిక్ష పడేదాక వదిలి పెట్టం.
రేవంత్.. కోర్టులు ఊరుకోవు
ఈరోజు దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు గట్టి తీర్పు ఇచ్చింది. దానం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రేవంత్ కు చెంపపెట్టు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రేవంత్ కు ఇది గట్టి గుణపాఠం. అధికారంలో చేతిలో ఉంది కదా అని ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగ విలువలను కాలరాస్తుంటే, ప్రతిపక్షాలను వేధిస్తుంటే న్యాయస్థానాలు గట్టి బుద్ది చెబుతున్నాయి. న్యాయవ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా వస్తున్న తీర్పులను స్వాగతిస్తున్నాం. దానం నాగేందర్ ఒక్కరే కాదు.. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రండి.
రాహుల్‌కు రాజ్యాంగ హసనం కనిపిస్తలేదా?
చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ హననం కనిపించడం లేదా? కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే కనిపించడం లేదా? మీ మాటల్లో నిజాయితీ లేదా? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది అని చెప్పుకునే రాహుల్ గాంధీ.. మరి ఎందుకు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంగం మీద మీకు నిజంగా గౌరవం ఉంటే, వెంటనే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.
కాంగ్రెస్ తప్పు చేసిందని, స్పీకర్ ఫిరాయింపుదారులను కాపాడే ప్రయత్నం చేసారని సుప్రీంతీర్పుతో బట్టబయలైంది. మిగతా అందరి శాసన సభ్యులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా మిగతా వారితో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలు తీర్పు చెబుతారు. రేవంత్ రెడ్డి అరాచకాలు సుప్రీం తీర్పుతో బట్టబయలు అయ్యాయి అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Singareni | బొగ్గు ఉన్నా చీకట్లేనా?
- ●Alimony Rules in India | మాజీ భార్యకు రెండో పెళ్లి అయితే.. మొదటి భర్త భరణం చెల్లించాల్సిందేనా? చట్టం ఏం చెబుతోంది?
- ●Mivi One 5G | రూ.11,999కే మివి వన్ 5జి.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో అదిరిపోయే ఫీచర్లు..
- ●BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్లోనే అత్యధికం
- ●దానం పదవి ఎందుకు పోయింది? తీర్పులో కీలకమైన మూడు అంశాలు ఇవే
- ●Anija Biryani Trivandrum | 11 ఏళ్ల కల.. లాయర్లు, ఆటో డ్రైవర్లు క్యూ కట్టి మరీ కొంటున్న అరిటాకు దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఇదే..!

Singareni | బొగ్గు ఉన్నా చీకట్లేనా?

Alimony Rules in India | మాజీ భార్యకు రెండో పెళ్లి అయితే.. మొదటి భర్త భరణం చెల్లించాల్సిందేనా? చట్టం ఏం చెబుతోంది?

Mivi One 5G | రూ.11,999కే మివి వన్ 5జి.. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో అదిరిపోయే ఫీచర్లు..

BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్లోనే అత్యధికం







